దిగుమతి సుంకాన్ని తగ్గిస్తేనే గిరాకీ పుంజుకుంటుంది: బీఎండబ్ల్యూ ఇండియా!

by  |
దిగుమతి సుంకాన్ని తగ్గిస్తేనే గిరాకీ పుంజుకుంటుంది: బీఎండబ్ల్యూ ఇండియా!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీ పెరిగేందుకు కొంత కాలం లేదంటే కొన్ని యూనిట్లపై దిగుమతి సుంకాలను తగ్గించాలని లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ప్రభుత్వాన్ని కోరింది. దీనివల్ల దేశీయంగానే ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) తయారీకి వీలవుతుందని, కొత్త టెక్నాలజీని వీలైనంత త్వరగా ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుందని కంపెనీ తెలిపింది.

గత 15 ఏళ్లుగా భారత్‌లోనే వాహనాల తయారీ నిర్వహిస్తున్నామని, ఎలక్ట్రిక్ వాహనాలకు సైతం స్థానిక తయారీతో డిమాండ్‌ను సృష్టించవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ‘వాహన అమ్మకాలను పెంచేందుకు డిమాండ్ పెంచడం, కొత్త టెక్నాలజీ వాహనాలు అందించేందుకు స్థానిక తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉండటం అవసరముందని’ బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు, సీఈఓ విక్రమ్ పవా అన్నారు. విదేశాల్లో తయారైన కార్లకు భారత్‌లో 60-100 శాతం దిగుమతి సుంకం ఉంటోందని కంపెనీ పేర్కొంది. కాగా, బీఎండబ్ల్యూ సంస్థ రాబోయే ఆరు నెలల్లో దేశీయంగా మూడు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నట్లు గత వారం ప్రకటించింది.


Next Story