రాజ్యసభలో మెన్స్ డే కోసం డిమాండ్.. ఆ మహిళా ఎంపీ ఎవరంటే?

by  |
రాజ్యసభలో మెన్స్ డే కోసం డిమాండ్.. ఆ మహిళా ఎంపీ ఎవరంటే?
X

న్యూఢిల్లీ : ఈ రోజు(మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటారు. మహిళ నారీమణులు వివిధ రంగాల్లో సాధించిన ఘనతలు, విజయాలను గుర్తిస్తూ వేడుకలు చేసుకుంటాం. కానీ, రాజ్యసభలో వినూత్న డిమాండ్ వచ్చింది. ఇదే రోజును అంతర్జాతీయ పురుషుల దినోత్సవంగానూ సెలబ్రేట్ చేసుకోవాలని డిమాండ్ చేశారు. దీన్ని కూడా ఒక మహిళా ఎంపీనే డిమాండ్ చేయడం గమనార్హం.

బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో భాగంగా ప్రారంభమైన రాజ్యసభలో బీజేపీ ఎంపీ సోనాల్ మాన్‌సింగ్ మాట్లాడుతూ, ఈ రోజు అంతర్జాతీయ పురుషుల దినోత్సవంగానూ వేడుకలు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నానంటూ సంచలనాన్ని రేపారు. అనంతరం ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ, ‘పార్లమెంటులో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని 24 ఏళ్ల క్రితం డిమాండ్ చేశారు. కానీ, ఇప్పుడు దీన్ని 50శాతానికి పెంచాల్సిన అవసరముంది’ అని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే సమావేశాలు ప్రారంభమవడంతో తొలుత మహిళా ఎంపీలకే మాట్లాడే అవకాశమిచ్చారు.


Next Story

Most Viewed