బీజేపీ ‘జాతిపిత’నే మార్చే ఆలోచనలో ఉంది.. ఒవైసీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

126
asaduddin-owaisi

దిశ, వెబ్‌డెస్క్ : ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి కేంద్రంపై సంచలన ఆరోపణలు చేశారు. అధికారంలో ఉన్న బీజేపీ త్వరలో వీర్ సావర్కర్‌ను జాతిపితగా ప్రకటిస్తుందని ఆరోపించారు. బుధవారం ఒవైసీ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ వక్రీకృత చరిత్రను ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. ఇది ఇలాగే కొనసాగితే బీజేపీ.. జాతిపితగా మహాత్మా గాంధీని తొలగించి దామోదర్ వీర్ సావర్కర్‌ను జాతిపితగా ప్రకటిస్తుందని అన్నారు.

అయితే ‘Veer Savarkar: The Man Who Could Have Prevented Partition’ పుస్తకాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్.. గాంధీజీ తనకు క్షమాభిక్ష పిటిషన్ రాయమని సావర్కర్‌ను అడిగారని కామెంట్స్ చేశారు.

ఈ కామెంట్స్‌పై స్పందించిన ఒవైసీ.. గాంధీజీ తన జీవితకాలంలో చాలా సార్లు జైలు శిక్ష అనుభవించారని, ఒక్కసారి కూడా గాంధీ దయ కోరుకోలేదని గుర్తు చేశారు. అయితే.. గాంధీజీ క్షమాభిక్ష పిటిషన్ రాయమని సావర్కర్‌ను ఎలా అడిగారని ప్రశ్నించారు. ఇది పచ్చి అబద్ధమని ఒవైసీ తెలిపారు. ఈ పుస్తకంపై కూడా ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు.