వారి ఓట్ల కోసమే అసెంబ్లీ పెడుతున్నారు….

by Shyam |

<p>దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్‌ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ విమర్శలతో విరుచుకు పడ్డారు. కేసీఆర్ బరి తెగించారని ఆయన అన్నారు. హిందువుల మనోభావాలను సీఎం కేసీఆర్ దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు. కారు పార్టీ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని ఆయన చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓ వర్గం ఓట్లను దక్కించుకునేందుకు సీఎం కేసీఆర్ తాపత్రయ పడుతున్నారని ఆయన అన్నారు. ముస్లింల ఓట్ల కోసమే అసెంబ్లీని పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ముస్లింలకు [&hellip;]</p>

వారి ఓట్ల కోసమే అసెంబ్లీ పెడుతున్నారు….
X

దిశ, వెబ్ డెస్క్:
సీఎం కేసీఆర్‌ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ విమర్శలతో విరుచుకు పడ్డారు. కేసీఆర్ బరి తెగించారని ఆయన అన్నారు. హిందువుల మనోభావాలను సీఎం కేసీఆర్ దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు. కారు పార్టీ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని ఆయన చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓ వర్గం ఓట్లను దక్కించుకునేందుకు సీఎం కేసీఆర్ తాపత్రయ పడుతున్నారని ఆయన అన్నారు. ముస్లింల ఓట్ల కోసమే అసెంబ్లీని పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ముస్లింలకు కొత్తగా రిజర్వేషన్లు ఎందుకని ఆయన ప్రశ్నించారు.

Next Story