సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ హెచ్చరిక

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తలను ఇబ్బందిపెట్టే పద్దతులను సీఎం కేసీఆర్ మార్చుకోవాలని సూచించారు. సిద్దిపేటలో బీజేపీ కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేస్తూ.. అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అంతేగాకుండా అక్రమంగా అరెస్టు చేసిన బీజేపీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని [&hellip;]</p>

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తలను ఇబ్బందిపెట్టే పద్దతులను సీఎం కేసీఆర్ మార్చుకోవాలని సూచించారు. సిద్దిపేటలో బీజేపీ కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేస్తూ.. అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అంతేగాకుండా అక్రమంగా అరెస్టు చేసిన బీజేపీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులు ఆపకపోతే తర్వాతి పరిణామాలను టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కూడా అంచనా వేయలేదు అని హెచ్చరించారు. టీఆర్ఎస్ నియంత పాలనకు, ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.

Next Story