- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో బీజేపీ రాష్ట్ర నేత లాల్ వర్మ మృతి..
<p>దిశ, బేగంపేట : బీజేపీ రాష్ట్ర కోశాధికారి బావ లాల్ వర్మ కరోనాతో శనివారం ఉదయం7.30కు మృతి చెందారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన ఫిబ్రవరి 28న సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్‌లో చేరారు. కొవిడ్‌తో పాటు నిమోనియా వ్యాధి సోకడంతో ఆరోగ్యం క్షీణించి మృతి చెందినట్లు కిమ్స్ వైద్యులు ప్రకటించారు. వర్మ సనత్ నగర్ నియోజకవర్గం మొండా డివిజన్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. చాలా కాలంగా బీజేపీలో పని చేస్తున్నారు. గతంలో సనత్‌నగర్ నియోజకవర్గం ఇంచార్జిగా […]</p>

దిశ, బేగంపేట : బీజేపీ రాష్ట్ర కోశాధికారి బావ లాల్ వర్మ కరోనాతో శనివారం ఉదయం7.30కు మృతి చెందారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన ఫిబ్రవరి 28న సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్‌లో చేరారు. కొవిడ్‌తో పాటు నిమోనియా వ్యాధి సోకడంతో ఆరోగ్యం క్షీణించి మృతి చెందినట్లు కిమ్స్ వైద్యులు ప్రకటించారు. వర్మ సనత్ నగర్ నియోజకవర్గం మొండా డివిజన్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. చాలా కాలంగా బీజేపీలో పని చేస్తున్నారు. గతంలో సనత్‌నగర్ నియోజకవర్గం ఇంచార్జిగా కూడా కొనసాగారు. 2002లో మొండా డివిజన్ బీజేపీ కార్పొరేటర్‌గా గెలుపొందారు.
2018లో సనత్ నగర్ నుండి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనకు నలుగురు కూతుళ్లు ఒక కుమారుడున్నాడు. వర్మ అంతక్రియలు శనివారం మధ్యాహ్నం మొండా డివిజన్లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, వర్మ మృతిపట్ల తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళ్లు అర్పించారు.






