- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దూకుడు పెంచిన BJP.. కీలక సమావేశానికి మహబూబ్ నగర్ రెడీ
రేపు మహబూబ్‌నగర్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది.

X
దిశ, వెబ్ డెస్క్: రేపు మహబూబ్‌నగర్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ ముఖ్య నేతలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అర్వింద్ మీనన్ హాజరుకానున్నారు. పార్టీ నేతలకు రానున్న ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు మహబూబ్ నగర్ కు తరుణ్ చుగ్, బండి సంజయ్ వెళ్లనున్నారు.
సాయంత్రం 5 గంటలకు బండి సంజయ్ అధ్యక్షతన రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం జరగనుంది. రేపు ఉదయం 9 గంటలకు రాష్ట్ర కార్యవర్గం మీటింగ్ ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి బండి సంజయ్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, బీజేపీ నేత డీకే అరుణ హాజరుకానున్నారు.
Also Read...
Next Story






