- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓకే ఊరిలో రెండు జిల్లాల అధ్యక్షులు
<p>దిశ, హుజురాబాద్: పక్క పక్కనే ఉండే రెండు జిల్లాల అధ్యక్షులది ఒకే ఊరు. జాతీయ పార్టీ అయిన బీజేపీ రెండు జిల్లాల అధ్యక్షులు ఆ గ్రామానికి చెందినవారే. పైగా బంధువులు కూడా.. ఒకే సామాజిక వర్గం.. ఉద్యమాల ఖిల్లాగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లాలోని వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నాయకులు రెండు జిల్లాల అధ్యక్షులు. కరీంనగర్, వరంగల్ అర్బన్ జిల్లాల అధ్యక్షులు ఒకే గ్రామానికి చెందిన వారు కావడం […]</p>

దిశ, హుజురాబాద్: పక్క పక్కనే ఉండే రెండు జిల్లాల అధ్యక్షులది ఒకే ఊరు. జాతీయ పార్టీ అయిన బీజేపీ రెండు జిల్లాల అధ్యక్షులు ఆ గ్రామానికి చెందినవారే. పైగా బంధువులు కూడా.. ఒకే సామాజిక వర్గం.. ఉద్యమాల ఖిల్లాగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లాలోని వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నాయకులు రెండు జిల్లాల అధ్యక్షులు. కరీంనగర్, వరంగల్ అర్బన్ జిల్లాల అధ్యక్షులు ఒకే గ్రామానికి చెందిన వారు కావడం విశేషం. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గంగాడి కృష్ణారెడ్డి ఉండగా పక్క జిల్లా అయిన వరంగల్ అర్బన్ జిల్లాకు అదే గ్రామానికి రావు పద్మ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ రెండు పర్యాయాలుగా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నప్పటికీ గంగాడి కృష్ణారెడ్డి మాత్రం ఇదే ప్రథమం. అంతేకాకుండా వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ వరంగల్ తూర్పు నుండి 2014 ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి..
వరంగల్ అర్బన్ జిల్లాకు రథసారథిగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రావు పద్మ భర్త అమరేందర్ రెడ్డి బీజేపీ అనుబంధ విభాగం ఏబీవీపీ నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆహ్వానంతో తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఆ తర్వాత అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు మళ్లీ బీజేపీలోకి వచ్చారు. అప్పుడే ఆయన సతీమణి రావు పద్మ బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2014లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. జిల్లాల పునర్విభజన అనంతరం వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలిగా పద్మ ఎన్నికయ్యారు. దీంతో రెండో సారి అధ్యక్ష పీఠం ఆమెను వరించింది.
విద్యార్థి స్థాయి నుంచి..
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గంగాడి కృష్ణారెడ్డి ఏబీవీపీలో పనిచేశారు. 1994-95 వరకు హుజురాబాద్ టౌన్ సెక్రెటరీగా, 1996-97లో హుజురాబాద్ డివిజన్ కన్వీనర్‌గా, 1996 సం.లో బీపీ స్కాలర్ షిప్ ఉద్యమంలో జైల్లో ఉండగా తన తండ్రి మరణించడంతో అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. 1997-98 తెలంగాణ విద్యార్థి యువజన సంఘం కరీంనగర్ జిల్లా జాయింట్ కన్వీనర్‌గా, 1998-2000 వరకు కరీంనగర్ జిల్లా కన్వీనర్‌గా, 2000-2005 వరకు చెన్నై సిటీ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా, తమిళనాడు స్టేట్ జాయింట్ సెక్రటరీగా 5 సం.లు కార్యకర్తగా పని చేశారు. బీజేపీ కమలాపూర్ నియోజకవర్గ కన్వీనర్‌గా, కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా, రెండు సార్లు జిల్లా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. హుజురాబాద్ పీవీ జిల్లా ఉద్యమంలో అలాగే ఆర్‌డీఓ కార్యాలయం కోసం పార్టీ పక్షాన క్రీయాశీల పాత్ర పోషించారు.






