- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అశోక్ గజపతిరాజును అవమానించడం సరికాదు: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: రామతీర్థంలో టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుపై వ్యవహరించిన తీరును ఖండిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్సీ వి.వి.ఎన్.మాధవ్ తెలిపారు. గతంలో కూడా సింహాచలం దేవస్థానం చైర్మన్ పదవి నుండి అర్ధరాత్రి జీవోతో తొలగించిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు శంకుస్థాపనకు పిలిచి అవమానించడం దారుణమన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సంప్రదాయాలను గౌరవించడం లేదని, గతంలో జరిగిన సంఘటనను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. హిందువుల మనోభావాలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పార్టీలను పక్కన పెట్టి ఆలయ ధర్మకర్తగా అశోక్ గజపతిరాజుకు గౌరవం ఇవ్వాలని కోరారు.
Next Story