ఈటల ఆరోగ్యం బాగానే ఉంది.. పరామర్శించిన బీజేపీ ఎమ్మెల్యేలు

by  |
etala-rajender-sick
X

దిశ, వెబ్‌‌డెస్క్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పాదయాత్ర ప్రారంభించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌‌ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈటల రాజేందర్‌ను బీజేపీ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావులు ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఈటల ఆరోగ్య పరిస్థితిపై వారు మీడియాతో మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ సోమవారం ఆసుపత్రి డిశ్చార్జి అవుతారని, ఈటల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వెల్లడించారు. మళ్లీ త్వరలోనే ఈటల పాదయాత్ర ప్రారంభిస్తారని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఈటల హుజురాబాద్‌లో గెలవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.


Next Story