- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువత పార్టీలో చేరడం శుభపరిణామం
by Shyam |
<p>దిశ, సిద్దిపేట: యువత టీఆర్ఎస్ పార్టీలో చేరడం శుభపరిణామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్, తిమ్మక్కపల్లి, ఆనాజ్పూర్ గ్రామాలకు చెందిన బీజేపీ యువకులు హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక, రాయ్ పోల్ మండలం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. యువతను ఆకర్షించేలా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాయమాటలు చెబుతున్న విషయాన్ని గ్రహించి పని చేసే పార్టీ వైపు […]</p>

X
దిశ, సిద్దిపేట: యువత టీఆర్ఎస్ పార్టీలో చేరడం శుభపరిణామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్, తిమ్మక్కపల్లి, ఆనాజ్పూర్ గ్రామాలకు చెందిన బీజేపీ యువకులు హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక, రాయ్ పోల్ మండలం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. యువతను ఆకర్షించేలా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాయమాటలు చెబుతున్న విషయాన్ని గ్రహించి పని చేసే పార్టీ వైపు వచ్చిన వారందరికీ తగిన గుర్తింపు ఇస్తామన్నారు. కళ్ల ముందు కనిపించని నాయకులకు దుబ్బాకలో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు సొంత ఖర్చులతో కోచింగ్ సెంటర్లు పెట్టి ఎంతోమంది కుటుంబాల్లో వెలుగులు నింపామని చెప్పారు.
Next Story






