- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ పొగరు అణచాలంటే బీజేపీని గెలిపించండి- విజయశాంతి
<p>దిశ, నాగార్జున సాగర్: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా తిరుమలగిరి మండలంలో బీజేపీ సీనియర్ నేత విజయశాంతి ప్రచారానికి విశేష స్పందన వస్తోంది. ఏప్రిల్ 17న జరగనున్న ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి బీజేపీ అభ్యర్థి డా.పానుగోతు రవి నాయక్ ను గెలిపించాల్సిందిగా ఆమె ప్రజలను అభ్యర్థించారు.ప్రచారంలో పాల్గొన్న విజయశాంతి మాట్లాడుతూ..దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని, ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకుంటే మళ్లీ ఓట్లు అడగనని చెప్పిన కేసీఆర్ ఆ పని […]</p>

దిశ, నాగార్జున సాగర్: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా తిరుమలగిరి మండలంలో బీజేపీ సీనియర్ నేత విజయశాంతి ప్రచారానికి విశేష స్పందన వస్తోంది. ఏప్రిల్ 17న జరగనున్న ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి బీజేపీ అభ్యర్థి డా.పానుగోతు రవి నాయక్ ను గెలిపించాల్సిందిగా ఆమె ప్రజలను అభ్యర్థించారు.ప్రచారంలో పాల్గొన్న విజయశాంతి మాట్లాడుతూ..దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని, ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకుంటే మళ్లీ ఓట్లు అడగనని చెప్పిన కేసీఆర్ ఆ పని చేయకుండా మళ్లీ ఓట్లు అడుగుతున్నారని విజయశాంతి అన్నారు. తెలంగాణలో భూముల కబ్జాలు పెరిగిపోయానని, కేసీఆర్ పొగరును అణచివేయాలంటే బీజేపీకి ఓట్లు వేయాలని ఆమె కోరారు. ఈ రోడ్ షో లో అభ్యర్థి రవి నాయక్, బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, నూకల నర్సింహారెడ్డి, నివేదిత రెడ్డి ,ఇంద్రసేనారెడ్డి ,దినేష్ నాయక్ ,తదితరులు పాల్గొన్నారు






