- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నయా నిజాం కేసీఆర్.. లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
<p>దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: కేసీఆర్ ఏడేళ్ల అహంకారపూరిత, నియంతృత్వ పాలనతో ప్రజలు విసిగిపోయారని, తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని ఓబీసీ జాతీయ అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ అన్నారు. బొక్క నర్సింహారెడ్డి అధ్యక్షతన తుర్కయంజాల్‌లో జరిగిన బీజేపీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశానికి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నయా నిజాంను తలపించేలా కేసీఆర్ పాలన సాగుతోందని విమర్శించారు. మజ్లిస్ పార్టీతో అంటకాగుతూ కేసీఆర్ విర్రవీగుతున్నారని ఆరోపించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అది బీజేపీ వల్లే సాధ్యమని నమ్ముతున్నారన్నారు. రాష్ట్రంలో […]</p>

దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: కేసీఆర్ ఏడేళ్ల అహంకారపూరిత, నియంతృత్వ పాలనతో ప్రజలు విసిగిపోయారని, తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని ఓబీసీ జాతీయ అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ అన్నారు. బొక్క నర్సింహారెడ్డి అధ్యక్షతన తుర్కయంజాల్‌లో జరిగిన బీజేపీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశానికి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నయా నిజాంను తలపించేలా కేసీఆర్ పాలన సాగుతోందని విమర్శించారు. మజ్లిస్ పార్టీతో అంటకాగుతూ కేసీఆర్ విర్రవీగుతున్నారని ఆరోపించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అది బీజేపీ వల్లే సాధ్యమని నమ్ముతున్నారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను, మజ్లిస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం, సత్తా బీజేపీకే ఉందన్నారు. టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ ఏనాడూ ప్రత్యామ్నాయం కాదని, అవి రెండూ ఒకే గూటి పక్షులు, తోడు దొంగలు అని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలోనూ కాంగ్రెస్ విఫలమైందని దుయ్యబట్టారు.






