- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ నాయకుడి కిడ్నాప్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: భూతల స్వర్గమైన జమ్మూకశ్మీర్‌లో బీజేపీ నాయకులపై రోజురోజకూ దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల బాండిపోరాకు చెందిన బీజేపీ నాయకుడు షేక్ వసీం బారి, ఆయన సోదరుడు, తండ్రిని ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయం అందరికీ తెలిసిందే.. కొద్ది రోజుల కిందట జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపడమే కాకుండా, బీజేపీ అగ్రనాయకత్వానికి ఆగ్రహం కూడా తెప్పించింది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుండగానే.. బారాముల్లాలో మరో బీజేపీ నాయకుడిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భూతల స్వర్గమైన జమ్మూకశ్మీర్‌లో బీజేపీ నాయకులపై రోజురోజకూ దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల బాండిపోరాకు చెందిన బీజేపీ నాయకుడు షేక్ వసీం బారి, ఆయన సోదరుడు, తండ్రిని ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయం అందరికీ తెలిసిందే.. కొద్ది రోజుల కిందట జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపడమే కాకుండా, బీజేపీ అగ్రనాయకత్వానికి ఆగ్రహం కూడా తెప్పించింది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుండగానే.. బారాముల్లాలో మరో బీజేపీ నాయకుడిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. స్థానిక బీజేపీ నేత, మునిసిపల్ కమిటీ వాటర్‌గామ్ ఉపాధ్యక్షుడైన మెరాజుద్దీన్ మల్లాను ఉత్తర కశ్మీర్‌లో కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. విషయం తెలిసిన వెంటనే భద్రతా బలగాలు రంగంలోకి దిగి మల్లా కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
Next Story






