- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్.. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు !
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత డీకే అరుణ ఫైర్ అయ్యారు. కేసీఆర్‌కు హిందువులన్నా.. హిందూ సంస్కృతి, సంప్రదాయాలన్నా చులకనగా మారిందని మండిపడ్డారు. ఒక మతానికి మాత్రమే తొత్తుగా వ్యవహరిస్తూ ఓట్ల రాజకీయం కోసం ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి వస్తున్న తుంగభద్ర పుష్కరాలపై సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పుష్కరాల ప్రారంభానికి ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉన్నా ఏర్పాట్లపై ఎలాంటి స్పష్టత లేదన్నారు. పుష్కరాలకు […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత డీకే అరుణ ఫైర్ అయ్యారు. కేసీఆర్‌కు హిందువులన్నా.. హిందూ సంస్కృతి, సంప్రదాయాలన్నా చులకనగా మారిందని మండిపడ్డారు. ఒక మతానికి మాత్రమే తొత్తుగా వ్యవహరిస్తూ ఓట్ల రాజకీయం కోసం ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి వస్తున్న తుంగభద్ర పుష్కరాలపై సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పుష్కరాల ప్రారంభానికి ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉన్నా ఏర్పాట్లపై ఎలాంటి స్పష్టత లేదన్నారు. పుష్కరాలకు కేవలం రూ. 5కోట్లు ప్రకటించి చేతులు దులుపుకోవడం సమంజసం కాదన్నారు. కొవిడ్‌ను సాకుగా చూపి పుష్కరాలను పట్టించు కోవడం లేదని విమర్శించారు.
Next Story






