ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: డీకే అరుణ

37

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే జీహెచ్ఎంసీ పరిధి ప్రాంతాలు మొత్తం దుర్భరంగా మారయని డీకే అరుణ అన్నారు. హైదరాబాద్‌ బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆమె.. నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు రూ. 12 వేల కోట్ల ఖర్చు చేశామని సీఎం ప్రగల్బాలు పలికారన్నారు. కానీ, ప్రస్తుతం అభివృద్ధికి నోచుకోకుండా దుర్బర స్థితిలో నగరం దర్శనమిస్తోందని విమర్శించారు. ఎప్పుడూ కూడా వర్షాలతో ఈ స్థాయిలో హైదరాబాద్‌ ముంపునకు గురి కాలేదన్నారు. హైదరాబాద్ రూపురేఖలను మార్చేస్తానని చెప్పిన సీఎం చివరకు చేసిందేమి లేదని డీకే అరుణ మండిపడ్డారు.