జనసేన పొత్తుపై బీజేపీ క్లారిటీ..!

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‎డెస్క్: గ్రేటర్ ఎన్నికల్లో జనసేనతో పొత్తు లేదని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తాను సమావేశం కావడం లేదన్నారు. పొత్తు గురించి ఎలాంటి ఆలోచన లేదని తెలిపారు. ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థుల జాబితా సిద్ధమైందని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ పై తమకు గౌరవం ఉందని.. తనతో మంచి సంబంధాలు ఉన్నాయని బండి సంజయ్ తెలిపారు. కాగా, మరోవైపు పొత్తుపై పవన్‎తో బీజేపీ నేతలు భేటీ [&hellip;]</p>

bjp, janasena
X

దిశ, వెబ్‎డెస్క్: గ్రేటర్ ఎన్నికల్లో జనసేనతో పొత్తు లేదని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తాను సమావేశం కావడం లేదన్నారు. పొత్తు గురించి ఎలాంటి ఆలోచన లేదని తెలిపారు. ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థుల జాబితా సిద్ధమైందని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ పై తమకు గౌరవం ఉందని.. తనతో మంచి సంబంధాలు ఉన్నాయని బండి సంజయ్ తెలిపారు. కాగా, మరోవైపు పొత్తుపై పవన్‎తో బీజేపీ నేతలు భేటీ కాబోతున్నారని జనసేన ప్రకటన విడుదల చేసింది.

Next Story