ఏపీ బీజేపీ కోర్ కమిటీ ప్రకటన.. చోటు దక్కించుకున్న వారు వీరే

by srinivas |
BJP
X

దిశ, ఏపీ బ్యూరో: భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ‌ సింగ్‌ ఏపీ బీజేపీ రాష్ట్ర కోర్‌ కమిటీని ప్రకటించారు. ఈ కోర్‌ కమిటీలో 13 మంది సభ్యులుండగా.. ముగ్గురిని ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకటించారు. ఈ కోర్‌ కమిటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌, సుజనా చౌదరీలకు చోటు కల్పించారు.

వీరితోపాటు కన్నా లక్ష్మీ నారాయణ, మధుకర్‌, పీవీఎన్ మాధవ్‌, రేలంగి శ్రీదేవి, చంద్రమౌళి, నిమ్మక్క జయరాజులకు కోర్‌కమిటీలో అవకాశం కల్పించారు. ఇకపోతే ప్రత్యేక ఆహ్వానితులుగా నేషనల్‌ జాయింట్‌ సెక్రటరీ శివ ప్రకాష్‌, ఏపీ ఇన్‌చార్జీ మురళీ ధరన్‌, సహా ఇన్‌చార్జీ సునీల్‌‌ దేవధర్‌లను నియమించారు. ఈ కోర్‌ కమిటీ సమావేశాన్ని తప్పనిసరిగా నెలకి ఒకసారైనా జరపాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ సింగ్ ఆదేశించారు.

BJP



Next Story

Most Viewed