- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనాతో బీజేడీ ఎమ్మెల్యే కన్నుమూత..!
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలో బిజు జనతాదళ్(బీజేడీ) నేత, పిపిలి ఎమ్మెల్యే ప్రదీప్ మహారథి కన్నుమూశారు. కరోనా బారినపడడంతో సెప్టెంబర్ 14న నుంచి భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో ప్రదీప్ మహారథిను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సనందించారు. ఆదివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. పూరీ జిల్లాలోని పిపిలి నియోజకవర్గం నుంచి ప్రదీప్ మహారథి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పలుమార్లు మంత్రిగానూ పనిచేశారు. ఆయనకు భార్య ప్రతివా మహారథి, ఒక కుమారుడు, కుమార్తె […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలో బిజు జనతాదళ్(బీజేడీ) నేత, పిపిలి ఎమ్మెల్యే ప్రదీప్ మహారథి కన్నుమూశారు. కరోనా బారినపడడంతో సెప్టెంబర్ 14న నుంచి భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో ప్రదీప్ మహారథిను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సనందించారు. ఆదివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.
పూరీ జిల్లాలోని పిపిలి నియోజకవర్గం నుంచి ప్రదీప్ మహారథి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పలుమార్లు మంత్రిగానూ పనిచేశారు. ఆయనకు భార్య ప్రతివా మహారథి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రదీప్ మహారథి మృతి పట్ల సీఎం నవీన్ పట్నాయక్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సంతాపం తెలిపారు.
Next Story






