కావ్..కావ్ : కాకులతో మరో కొత్త రోగం.. కేంద్రం హెచ్చరికలు

by  |
కావ్..కావ్ : కాకులతో మరో కొత్త రోగం.. కేంద్రం హెచ్చరికలు
X

దిశ,వెబ్ డెస్క్: భారత్‌కు కరోనాతో పాటు మరో వైరస్‌తో ప్రమాదం పొంచి ఉందని కేంద్రం అన్నీ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. కాకుల నుంచి బర్డ్‌ఫ్లూ వైరస్ సోకే ప్రమాదం ఉందని అలర్ట్ చేసింది. ఇటీవల రాజస్థాన్ లో వరుసగా కాకులు చనిపోతున్నాయి. వాటి మరణంపై ఆరోగ్యశాఖ అధికారులు పలు టెస్ట్ లు చేయగా ..వాటిలో బర్డ్ ఫ్లూ వైరస్‌ను గుర్తించినట్లు రాజస్థాన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కుంజీ లాల్ మీనా తెలిపారు.

వలస పక్షుల అనుమానాస్పద మృతి

హిమాచల్‌ప్రదేశ్ కంగారాజిల్లా లో 12వేల కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న పోంగ్ అభయారణ్యంలో (మహరాణ ప్రతాప్ రిజర్వాయర్) సమీపంలో సుమారు 1700 వలస పక్షులు అనుమానస్పదంగా మరణించినట్లు జగ్మోలి అటవీ ప్రాంతంలోని ఫారెస్ట్ బీట్ అధికారులు తెలిపారు.

దీంతో పక్షుల మరణంపై అప్రమత్తమైన హమీర్‌పూర్ డివిజన్ డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్ (వైల్డ్ లైఫ్) రాహుల్ రోహనే.. వివిధ ప్రాంతాల్లో మరణించిన పక్షుల కళేబరాల నుంచి 15 శాంపిల్స్ ను సేకరించి ఉత్తర ప్రదేశ్‌ జలంధర్‌లోని నార్తరన్ రీజినల్ డిసీజ్ డయాగ్నొస్టిక్ ల్యాబరేటరీకి (ఎన్‌ఆర్‌డిడిఎల్), భోపాల్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబరేటరీ (హెచ్ఎస్ఏడీఎల్) కి పంపినట్లు చెప్పారు. ఈ శాంపిల్ రిజల్డ్ మరో రెండురోజుల్లో వచ్చే అవకాశం ఉందని, అయితే పక్షులు ఏవియన్ ఫ్లూ(బర్డ్ ఫ్లూ) తో మరణించినట్లు తాము అనుమానిస్తున్నట్లు రాహుల్ రోహనే నేషనల్ మీడియాకు తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

సైబేరియా, మంగోలియా దేశాల పక్షులు

చనిపోయిన 95శాతం పక్షుల్లో రష్యాలోని సైబీరియా మరియు ఈస్ట్ ఏషియన్ దేశాలకు చెందిన మంగోలియా అనే ప్రాంతంలోని బార్-హెడ్ గూస్ అనే జాతికి వన్యప్రాణులని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. వలస పక్షుల అంచనా ప్రకారం, ప్రతి సంవత్సరం శీతాకాలంలో 1.15- 1.20 లక్షల పక్షుల టోట్ పాంగ్ డ్యామ్ పక్షుల అభయారణ్యానికి వలస వస్తాయని, అలా వలస వచ్చిన ఈ పక్షులు అభయారణ్యంలో నాలుగు నెలల వరకు ఇక్కడే ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ పక్షులు చనిపోవడం, చనిపోయిన పక్షుల్లో బర్డ్ ఫ్లూ వైరస్ ఉందనే అనుమానంతో టెస్ట్‌ల కోసం ల్యాబరేటరీ పంపడం అన్నీ చకచక పూర్తి చేస్తున్నారు రాష్ట్రఅటవీశాఖ అధికారులు. ప్రస్తుతం పక్షుల మరణంపై ధర్మశాల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ల్యాబ్‌లకు పంపిన పక్షుల శాంపిల్స్ రిజల్ట్ వచ్చే వరకు పర్యాటక కార్యకలాపాలపై నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కాకుల్లో బర్డ్ ఫ్లూ వైరస్

రాజస్థాన్ లోని జహ్లవార్ లో -100 కాకులు, కోటలో- 47, బరణ్‌లో 72 కాకులు చనిపోయినట్లు రాజస్థాన్ ప్రధాన కార్యదర్శి కుంజి లాల్ మీనా అన్నారు. దీంతో పాటు మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ లోని ది డాలీ కాలేజీ క్యాంపస్‌లో దాదాపు 50 కాకులు చనిపోయినట్లు గుర్తించారు. మరణించిన కాకుల్ని భోపాల్‌ రీసెర్చ్ సెంటర్ కు పంపగా.. ఆ టెస్టుల్లో హెచ్5ఎన్8 వైరస్‌ ఉన్నట్లు తేలిందని ఇండోర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పూర్ణిమా గడారియా అన్నారు.


Next Story

Most Viewed