ఎర్రకోటలో ప్రజలకు అనుమతి నిషేధం

by  |
ఎర్రకోటలో ప్రజలకు అనుమతి నిషేధం
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని ఎర్రకోటలో జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు ఆ ప్రాంతం నుంచి సేకరించిన నమూనాల్లో బర్డ్ ఫ్లూ కేసులు ఉన్నట్టు నిర్ధారించబడ్డాయి. అక్కడ మరణించిన 15 కాకుల నుంచి సేకరించిన శాంపుల్స్‌ను భోపాల్, జలంధర్‌లలో ఉన్న ల్యాబ్స్‌కు పంపించగా బర్డ్‌ఫ్లూ పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం వరకు ప్రజల సందర్శనకు నిషేధం విధించారు. ఈ నెల 26వ తేదీ వరకు ఎర్రకోటను మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. 26న పరేడ్ నిమిత్తం తిరిగి ప్రారంభించనున్నారు. ప్రజలు, యాత్రికులను బర్డ్‌ఫ్లూ నుంచి రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని పౌల్ట్రీల వద్ద కోళ్ల నుంచి శాంపుల్స్‌ను భోపాల్ ల్యాబ్‌కు పంపించగా, నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. అయినప్పటికీ అధికారులు నగరంలోని ఘాజీపూర్ పౌల్ట్రీ మార్కెట్‌ను మూసేశారు. కాగా, ఇప్పటికే దేశంలోని పది రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కేసులు బయటపడ్డాయి. పలు రాష్ట్రాల్లో బాతులు, కోతులను సంహరిస్తున్నారు. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు బర్డ్‌ఫ్లూ వల్ల కలిగే రుగ్మతలపై అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇదిలా ఉండగా, ఢిలీ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో కొనసాగుతున్న బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో ఖాజీపూర్ పౌల్ట్రీ మార్కెట్‌లో సంహరణపై నిషేధం విధించాలని కోరుతూ వేసిన పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు మార్చి 8కి వాయిదా వేసింది.


Next Story

Most Viewed