- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bigg Boss- 9: ఇంట్లో నుంచి బయటకు వెళ్లేవరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను.. హౌస్‌లో స్టార్ట్ అయిన నిరాహార దీక్షలు (వీడియో)
బిగ్ బాస్ సీజన్ 9 రోజు రోజుకు ఎంతో రసవత్తరంగా సాగుతుంది.

దిశ, సినిమా: బిగ్ బాస్ సీజన్ 9 రోజు రోజుకు ఎంతో రసవత్తరంగా సాగుతుంది. ఈసారి సామాన్యులు, సెలబ్రిటీలు అంటూ రెండు టీమ్స్ మధ్య యుద్ధాలు మొదలు కాగా.. ఇప్పుడు వారిలో వారికే విభేదాలు నెలకొన్నాయి. గతవారం సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా స్టార్ట్ అయిన బిగ్ బాస్-9లో.. ఆరుగురు కామనర్స్, తొమ్మిదిమంది సెలబ్రిటీలు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ఎలిమినేషన్ ప్రక్రియలో రీతూ చౌదరి, సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, సంజన గల్రానీ, శ్రష్ఠి వర్మ, రాము రాథోడ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ ఎంపిక కాగా.. ఆదివారం ఎపిసోడ్‌లో శ్రష్ఠి వర్మ ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకు వచ్చింది.
ఇక ఈ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ఈరోజు సోమవారం స్టార్ట్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్-9 నుంచి ప్రోమో రిలీజ్ చేశారు టీమ్. ఇందులో గత వారం జరిగిన తప్పులను ఒకరికొకరు ఎత్తు పొడుచుకుంటూ వార్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే దమ్ము శ్రీజ, హరిత హరీష్ దగ్గరకు ఫుడ్ తీసుకుని వెళ్లి ‘రెండు రోజుల నుంచి ఏం తినడం లేదు.. నీరసం వస్తుంది తినండి’ అని చెప్తుంది. దీనిపై హరిత హరీష్ ‘తినను.. ఇంకొన్ని రోజుల వరకు తినను. కనీసం వాటర్ కూడా ముట్టుకోను. మీలాంటి వాళ్ల మధ్యలో ఉండాలి అనుకోవడం లేదు. ఇంట్లో నుంచి వెలిపోయేవరకు నేను ఏం తినను, తాగను’ అంటూ చెప్తాడు. ఇక మనీష్ కామనర్స్ అన్నదే ఒక గలీజ్ మార్క్.. ఫస్ట్ కామనర్స్ కాదు వరస్ట్ కామనర్స్ అంటూ ఎమోషనల్‌గా మాట్లాడాడు. ప్రజెంట్ సెకండ్ ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది.






