- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bigg Boss Buzz: ఎలిమినేట్ అయిన వాళ్ళని మనం చూసుకుందాం.. తుఫాను రానుందంటున్న టాలీవుడ్ హీరో (వీడియో)
బిగ్‌బాస్ సీజన్-9(Bigg Boss Season-9) స్టార్ట్ అయి 5 రోజులు పూర్తి అయింది. హౌస్‌లోకి వెళ్లిన 15మంది కంటెస్టెంట్స్ తమ ఆటను మొదలెట్టి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు.

దిశ, సినిమా: బిగ్‌బాస్ సీజన్-9 (Bigg Boss Season-9)స్టార్ట్ అయి 5 రోజులు పూర్తి అయింది. హౌస్‌లోకి వెళ్లిన 15మంది కంటెస్టెంట్స్ తమ ఆటను మొదలెట్టి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. ఇక ఈ వారం ఆదివారం ఎపిసోడ్‌లో డబుల్ ఎలిమినేషన్స్ జరగనుందని టాక్. ఈ సారి నామినేషన్స్‌లో 9 మంది సెలబ్రిటీలు శ్రష్ఠి వర్మ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, సంజనా గల్రానీ, తనూజా గౌడ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, డీమన్ పవన్, ఇమ్మానుయేల్ ఉండటం గమనార్హం. అయితే ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన వారిని పలు ప్రశ్నలు అడిగి తెలుసుకోవడానికి బిగ్‌బాస్ బజ్ పేరుతో ఈ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటిలాగానే ఈ సారి కూడా ఈ కార్యక్రమం ఉండనుంది.
ఇక ఇందులో బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన ఓ మాజీ కంటెస్టెంట్.. టాలీవుడ్ హీరో శివాజీ(Shivaji) బిగ్ బాస్ బజ్ పేరుతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ను రకరకాల ప్రశ్నలు అడగబోతున్నాడు. అలాగే హౌస్ లో కన్నింగ్ ఎవరు.? స్ట్రాంగ్ ఎవరు.? ఎందుకు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.? హౌస్ లో చేసిన తప్పులేంటి.? ఇలా ఎన్నోరకాల ప్రశ్నలు కాంట్రవర్సీ క్రియేట్ చేసేందుకు సిద్ధమైయ్యారు. తాజాగా, బిగ్‌బాస్ బజ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలై అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక ఈ కార్యక్రమాన్ని గత సీజన్ అంబటి అర్జున్ హోస్ట్ చేయగా.. సీజన్ 9 శివాజీని రంగంలోకి దింపారు.
విడుదలైన ప్రోమోలో ‘‘మీకు బటర్ ఫ్లై ఎఫెక్ట్ గురించి తెలుసా.. ఈ నేచర్‌లో ఎక్కడో జరిగిన మూమెంట్.. ఇంకెక్కడో జరిగే మూమెంట్‌ను డిసైడ్ చేస్తోంది దీన్ని బటర్ ఫ్లై ఎఫెక్ట్ అంటారు. సామాన్యులు, సెలబ్రిటీలు మధ్య జరుగుతున్న పోరులో గెలుపు ఎవరిదో మీరు డిసైడ్ చేయండి. వాళ్లు బయటకు వచ్చాక ఏది రైటో.. ఏది రాంగో మనం డిసైడ్ చేద్దాం. ఈసారి బిగ్‌బాస్ బజ్ కోసం ఇంకోసారి వేచి ఉండాల్సిన పని లేదు. ఎలిమినేట్ అయిన వెంటనే మన బజ్‌లో చూడొచ్చు’’ అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ షోపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది.






