- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్‌బాస్‌కు వెళ్లినందుకు నేను చెప్పుతో కొట్టుకోవాలి.. దుమారం రేపుతున్న మాజీ కంటెస్టెంట్ కామెంట్స్
తెలుగు రియాలిటీ షో సక్సెస్‌ఫుల్‌గా పలు సీజన్లను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇటీవల సీజన్ 9 ప్రారంభం అయింది.

దిశ, సినిమా: తెలుగు రియాలిటీ షో సక్సెస్‌ఫుల్‌గా పలు సీజన్లను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇటీవల సీజన్ 9 ప్రారంభం అయింది. సెప్టెంబర్ 7న స్టార్ట్ కాగా.. 50 రోజులు పూర్తి చేసుకుంది. 13 మందితో హౌస్ అంతా రణరంగంగా మారింది. అన్ని సీజన్లతో పోలిస్తే.. ఇది కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు నిర్వాహకులు. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోకపోగా.. విమర్శలు చేస్తున్నారు. హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జునను సైతం తిడుతున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, మాజీ కంటెస్టెంట్ బిగ్‌బాస్ షోపై సంచలన కామెంట్స్ చేసింది. ఈ షోకు ఎందుకు వెళ్లానా అని చెప్పుతో కొట్టుకోవాలంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది.
అసలు విషయంలోకి వెళితే.. మాజీ కంటెస్టెంట్ యాంకర్ విష్ణుప్రియ(Vishnupriya) ఇంతకుముందు బిగ్‌బాస్ షోలో పాల్గొని ఎంతోకొంత సంపాదించుకుని ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ఆమె టైమ్ చూసుకుని షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నేను డబ్బుల కోసమే బిగ్ బాస్ షోకు వెళ్లాను. కొత్త ఇల్లు కట్టుకోవచ్చు అని కంటెస్టెంట్ గా ఎంటరయ్యాను. కానీ అదేమీ జరగలేదు. ఇప్పుటికీ ఇంకా పాత ఇంట్లోనే ఉన్నాను. బిగ్ బాస్ హౌస్ కు వెళ్లడమనేది నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం. బిగ్ బాస్ లో నేను ఏమి నేర్చుకోలేదు. అన్ని బయట నా లైఫ్ లోనే నేర్చుకున్నాను.
మళ్లీ బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చినా అసలు వెళ్లను. ఒక్కసారి వెళ్లినందుకే నన్ను నేను తిట్టుకున్నాను. ఎందుకు వెళ్లాను? నా చెప్పు తో నన్ను కొట్టుకోవాలి అని నన్ను నేను తిట్టుకున్నా. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక నన్ను లవ్ చేసిన జనాలు ఉన్నారు కాబట్టి ఓకే అనుకున్నాను. అంతే కానీ దానివల్ల నాకు వచ్చింది ఏమీ లేదు. పైగా కొందరు తిట్టారు కూడా. అయినప్పటికీ భరించాను’’ అని చెప్పింది. ప్రజెంట్ ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. విష్ణు ప్రియ అంత మాట అనేసిందేంటని అంతా ఆశ్చర్యపోతున్నారు.






