Bigg Boss 7 Telugu: ఏంట్రా రైతు బిడ్డా.. నేను నీకంటే పెద్ద నటుడ్ని అంటూ.. రెచ్చిపోయిన అమర్ దీప్

by Disha Web Desk 10 |
Bigg Boss 7 Telugu: ఏంట్రా రైతు బిడ్డా.. నేను నీకంటే పెద్ద నటుడ్ని అంటూ.. రెచ్చిపోయిన అమర్ దీప్
X

దిశ,వెబ్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7.. రెండోవారం నామినేషన్స్ కొట్టుకోవడమే ఒక్కటే తక్కువ. వీళ్లు మనల్ని ఎంటెర్టైన్ చేయడానికి వెళ్లారో లేక వాళ్లు వాళ్లు తిట్టుకోవడానికి వెళ్లారో కూడా అర్ధం కావడం లేదు.ఇంటి సభ్యులందరు కలిసి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌కు ఇచ్చి పడేసారు. అస్తమానం నేను రైతు బిడ్డ.. అంటుంటే అమర్ డీప్ కాలి ఇష్టమొచ్చినట్టు తిట్టేసాడు. నువ్వు పదే పదే రైతు బిడ్డ.. రైతు బిడ్డ అని చెప్పమాకు .. ఓ లక్ష ఇస్తే.. రైతుకి ఇస్తానంటున్నావ్ కానీ.. వాళ్ల ప్లేస్‌లో ఓ రిక్షా డ్రైవర్.. లారీ డ్రైవర్ ఉంటాడు.. వాళ్లకి ఇస్తానని చెప్పవే’ అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. మనోడికి ఏమి చేయాలో తెలియక.. పుష్పలో అల్లు అర్జున్ మాదిరిగా భుజం ఎత్తడంతో.. ‘భుజం దించు.. భుజం దించు’ అంటూ కోపంతో ఊగిపోయాడు.

‘నేను మాట్లాడుతున్నాను కదా.. భుజం దించు’ అంటూ బాగా పూనకం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు. అన్నా చలి పెడుతుంది? అని ప్రశాంత్ చెప్పగా.. ‘ఇప్పుడు నువ్వు భుజం ఎత్తావ్ కదా.. ఇదే బాడీ లాంగ్వేజ్‌తో అన్నా నేను బిగ్ బాస్‌కి వస్తా అని ఎందుకు చెప్పలేదురా.. అంటూ పల్లవి ప్రశాంత్‌ను బంతి ఆట ఆడినట్టు ఆడుకున్నాడు అమర్ దీప్.

నిజానికి ఒక రైతు కష్టమే కాదు బీటెక్ చదివినోడి కష్టాలు నీకేం తెలుసు? చదివేసి ఏదో ఊరికి పోయి.. ఏం జాబ్ చేస్తున్నామో తెలియక.. తిండి లేక చచ్చిపోయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇంత వరకు వాళ్ల శవాలు కూడా దొరకలేదు అలాంటి వాళ్లకి ఏం చెప్తావ్.. నువ్వు నా దగ్గర నటించకు.. నేను నీకంటే పెద్ద నటుడ్ని’ అంటూ రెచ్చిపోయాడు అమర్ దీప్.

Read More: Bigg Boss 7 Telugu : 'కుక్కలా తిరిగిన నీకు అవకాశం ఇస్తే.. ఇక్కడకొచ్చి ఏమి చేస్తున్నావ్' అంటూ పల్లవి ప్రశాంత్ పై ఫైర్ అయిన రతిక



Next Story

Most Viewed