- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్కంఠకు తెర.. బిగ్ బాస్ 19 విజేత గౌరవ్ ఖన్నా
హిందీ బిగ్ బాస్ 19 విజేత ఎవరు అనే ఉత్కంఠకు తెర పడింది. బిగ్ బాస్-19 వ ట్రోఫీని టీవీ నటుడు గౌరవ్ ఖన్నా గెలుచుకున్నాడు. దీంతో అతనికి ప్రైజ్ మనీగా రూ.50 లక్షలు దక్కాయి.

దిశ, వెబ్ డెస్క్: హిందీ బిగ్ బాస్ 19 విజేత ఎవరు అనే ఉత్కంఠకు తెర పడింది. బిగ్ బాస్-19 వ ట్రోఫీని టీవీ నటుడు గౌరవ్ ఖన్నా (Gaurav Khanna) గెలుచుకున్నాడు. దీంతో అతనికి ప్రైజ్ మనీగా రూ.50 లక్షలు దక్కాయి. మొదటి నుంచి టైటిల్ రేసులో ఉన్న ఫర్హానా భట్ (Farhana Bhatt) రన్నరప్‌గా నిలిచారు. బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్ (Host Salman Khan) వీరిద్దరిని ఫైనలిస్టులుగా ప్రకటించి, చివరి అంకం తర్వాత గౌరవ్ ఖన్నా చేతిని పైకి ఎత్తి, విజేతగా ప్రకటించారు. బిగ్ బాస్ 19 టైటిల్ గెలిచిన తర్వాత అతను మీడియాతో మాట్లాడారు. హౌస్‌లోకి వెళ్లినట్లే తాను బయటకు వచ్చానని, ప్రేక్షకులు ఆ విషయాన్ని మెచ్చుకోవడం తనకు నిజంగా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
"నేను మారలేదు, నకిలీగా నటించలేదు. ప్రజలు ఏమనుకుంటున్నారో అని ఆలోచించి, నేను లోపల నటించలేదు. నేను ఇలాగే ఉంటాను" అని గౌరవ్ ఖన్నా స్పష్టం చేశారు. అలాగే తన వ్యక్తిత్వం గురించి వివరిస్తూ, "నేను అతిగా సంతోషపడను లేదా అతిగా బాధపడను. ఏది జరిగినా దాన్ని నేను అంగీకరిస్తాను" అని గౌరవ్ అన్నారు. "వంద శాతం కృషి చేయడం నా జీవిత లక్ష్యం" అని చెబుతూ, తాను బిగ్ బాస్ హౌస్‌లో కూడా అదే సూత్రాన్ని పాటించానని పరోక్షంగా తెలిపారు.






