- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బాస్‌లో రచ్చ రంబోలా.. రీతూ కారణంగా హింసాత్మకంగా నామినేషన్స్.. సంజన విశ్వరూపం..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో గత వారం రచ్చ రచ్చ జరిగింది. దివ్య, తనూజ గొడవ మస్త్ క్లిక్ అయింది. భీకరమైన రెస్పాన్స్ వచ్చింది. టీఆర్పీ రేట్ దూసుకుపోయింది. అయితే ఈ వారం నామినేషన్స్ అంతకు మించిన డ్రామాను చూపించాయి.

దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో గత వారం రచ్చ రచ్చ జరిగింది. దివ్య, తనూజ గొడవ మస్త్ క్లిక్ అయింది. భీకరమైన రెస్పాన్స్ వచ్చింది. టీఆర్పీ రేట్ దూసుకుపోయింది. అయితే ఈ వారం నామినేషన్స్ అంతకు మించిన డ్రామాను చూపించాయి. ముఖ్యంగా డీమాన్ పవన్, కళ్యాణ్ పడాల మధ్య జరిగిన వాగ్వాదం.. చూసేవాళ్లకు కొంచెం హింసాత్మకంగానే అనిపించింది. రీతూ అగ్గి రాజేసినట్లుగా మాట్లాడటంతో... డీమాన్, కళ్యాణ్ గొంతు పట్టుకోవడం.. కళ్యాణ్ చైర్స్‌ను తన్నడం.. చూసేవారికి ఇంకెంత రచ్చ జరుగుతుందోననే ఎగ్జైట్మెంట్ పెంచేసింది.
ఇదంతా పక్కన పెడితే చాలా రోజుల తర్వాత సంజన విశ్వరూపం చూపించేసింది. రీతూ, సంజనను నామినేట్ చేయడం.. తన గేమ్ కనపడటం లేదని అనడంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన సంజన.. రీతూ, డీమాన్ రొమాన్స్ చూడలేకపోతున్నానని ఇండైరెక్ట్‌గా చెప్పేసింది. ఆ మాటలు వెనక్కు తీసుకోవాలని ఇంటి సభ్యులంతా చెప్పినా.. ఆ మాటలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేసింది.






