సందీప్, ప్రశాంత్, శోభ పవరాస్త్రలను తిరిగి తీసేసుకున్న బిగ్‌బాస్.. ట్విస్ట్ మాముల్‌గా లేదుగా ప్రోమో

by Disha Web Desk 6 |
సందీప్, ప్రశాంత్, శోభ పవరాస్త్రలను తిరిగి తీసేసుకున్న బిగ్‌బాస్.. ట్విస్ట్ మాముల్‌గా లేదుగా ప్రోమో
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-7 ఈసారి ఉల్టా పుల్టా అని నాగార్జున ముందే తెలిపారు. అలాగే ఈ సీజన్ స్టార్ట్ అయి కానుండి ప్రసారమవుతున్న కొన్ని ఎపిసోడ్స్‌ను చూస్తుంటే నిజంగానే ఉల్టా పుల్టా అని అర్థమవుతుంది. పవరాస్త్రను సాధిస్తేనే కన్ఫమ్ హౌస్‌మెట్ అని బిగ్‌బాస్ అన్నారు. దీంతో నలుగురు సంపాదించారు. ఇటీవల శివాజీ అర్హడు కాదని హౌస్‌మెట్స్ ఓట్స్ వేయడంతో పవరాస్త్రను నాగార్జునతీసుకుని పగలగొట్టించిన విషయం తెలిసిందే. తాజాగా, రిలీజ్ అయిన ప్రోమోలో కన్ఫమ్ హౌస్‌మెట్స్‌కు బిగ్‌బాస్ షాకిచ్చాడు. మీ పవరాస్త్రను తిరిగి ఇచ్చేసే సమయం వచ్చింది అని బిగ్ బాస్ చెప్పి యాక్టివిటీ రూమ్ లో ఉన్న ఓ పెట్టెలో మీ పవరాస్త్రలను పెట్టేయాలని చెబుతాడు బిగ్ బాస్.

దీంతో ముగ్గురు తీసుకెళ్లి తమ పవరాస్త్రలను అందులో పెట్టేస్తారు. వాళ్ల పవరాస్త్రలు కూడా పోవడంతో శివాజీ చాలా సంతోషిస్తాడు. ఎయ్ ఎయ్ రో చూస్తవేరో.. పాడండ్రా అంటూ డ్యాన్స్ చేశాడు శివాజీ. ఆయన అలా చేయడంపై శోభా శెట్టి సీరియస్ అవుతుంది. కొందరు ఉంటారు. ఎవరిదైనా పోతే చాలు.. హ్యాపీ గా ఫీల్ అయ్యే వాళ్లు. అదేదో అంటారు కదా. మనకు రాక పోయినా పర్వాలేదు. పక్కవాళ్లకు రాకపోతే చాలు.. ఛీ.. అంటూ శోభాశెట్టి.. శివాజీని ఉద్దేశించి మాట్లాడుతుంది. ఆ తర్వాత తనకు కనీసం కాఫీ కూడా ఇవ్వడం లేదని.. హౌస్ మెట్ నుంచి కంటెస్టెంట్ గా మారాక తనకు ఒక కాఫీ కూడా తాగలేకపోతున్నానని శివాజీ తెగ బాధపడిపోతాడు. నా మనోభావాలు దెబ్బతింటున్నాయి. కాఫీ కూడా ఇవ్వలేని బతుకు నాదీ ఓ బతుకా.. సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటోంది అంటూ శివాజీ తెగ బాధపడిపోతాడు.

Next Story

Most Viewed