- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బాస్‌లో బిగ్ ట్విస్ట్.. ఈ వీక్ నో ఎలిమినేషన్...
బిగ్ బాస్ తెలుసు సీజన్ 9 మంచి రేటింగ్‌తో దూసుకుపోతుంది. ముఖ్యంగా దివ్య - తనూజ మధ్య జరిగిన గొడవకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సీజన్ మొత్తంలో ఫైర్ వార్ జరిగింది వీరిద్దరి మధ్యేనని

దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ తెలుసు సీజన్ 9 మంచి రేటింగ్‌తో దూసుకుపోతుంది. ముఖ్యంగా దివ్య - తనూజ మధ్య జరిగిన గొడవకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సీజన్ మొత్తంలో ఫైర్ వార్ జరిగింది వీరిద్దరి మధ్యేనని.. ఇన్నాళ్లు అందరూ సేఫ్ గేమ్ ఆడారని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మొత్తానికి దివ్యను తన అభిమానులు ఆకాశానికి ఎత్తితే.. తనూజను ఆమె ఫ్యాన్స్ ఆకాశానికి ఎత్తేశారు. దీంతో బిగ్ బాస్ యాజమాన్యం గందరగోళంలో పడిపోయినట్లు తెలుస్తోంది.
నిజానికి ఈ వీక్ ఆడియన్స్ ఓట్ల ప్రకారం దివ్య లేదా సంజన ఎలిమినేషన్ కావాల్సి ఉంది.. కానీ దివ్య కారణంగా మోస్ట్ రెస్పాన్స్ రావడంతో ఆమెను.. ఆ తర్వాత ఉన్న సంజనను కూడా తప్పించకుండా కాపాడటానికి.. బీబీ టీమ్ ఇమ్మాన్యుయెల్ పవర్ అస్త్ర వినయోగించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ వీక్ నో ఎలిమినేషన్.. కాగా ఈ వీక్ ఇంటి నుంచి ఎవరూ బయటకు పోవడం లేదని టాక్.






