- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్‌బాస్-9: ఈ వారం నామినేషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. ఎవరెవరు ఉన్నారంటే?
లుగు బిగ్‌బాస్ సీజన్-9(Bigg Boss Season-9)లో పూర్తి విభిన్నంగా కొనసాగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

దిశ, సినిమా: తెలుగు బిగ్‌బాస్ సీజన్-9(Bigg Boss Season-9)లో పూర్తి విభిన్నంగా కొనసాగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక 11వారాలకు చేరుకున్న ఈ షోలో ఈ వారం నామినేషన్స్‌లో కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు. తమ మాటలతో హీట్ పుట్టించారు. తాజాగా, విడుదలైన ప్రోమో.. అందరినీ కాస్త హర్ట్ చేసేలాగే ఉంది. అసలు ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం. రీతూ గేమ్‌లో వెనకబడిపోయిందని ఇమాన్యుయేల్ ఆమెను నామినేట్ చేశాడు. దీంతో ఆమె సైలెంట్‌గా ఏం ఉండలేదు. కాన్ఫిడెన్స్ లేనిది నీకంటూ ఫైర్ అయిపోయింది.
ఆ తర్వాత ఇమ్మూ, భరణి గేమ్‌పై పూర్తిగా ఎఫర్ట్స్ నామినేట్ చేయగా.. ప్రతి టాస్క్ తనకు సాధ్యమైనంతవరకు ఆడుతున్నట్లు వివరణ ఇచ్చుకున్నారు. షో స్టార్ట్ అయిన కానుంచి లవ్ బడ్స్‌గా ఉంటున్న రీతూ(Ritu Chaudhary),పవన్(Pawan)ల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. నువ్వు అరవడం వల్ల నా తప్పులేకపోయినా నాదే తప్పు అన్నట్లుగా బయటకు వెళ్తుందని రీతూని నామినేట్ చేయడంతో షాక్ అయిపోయింది. ఆ తర్వాత పవన్.. ప్రతిసారి నీది తప్పు లేదని స్టాండ్ తీసుకుని మాట్లాడటానికి ప్రయత్నించినా కానీ నాపై నమ్మకం లేదంటూ హర్ట్ చేస్తున్నావ్ అని కన్నీరు పెట్టుకుంటాడు.
అందరితో వాదించే రీతూ మాత్రం పవన్ ఎన్ని మాటలన్నా సైలెంట్‌గా వింటూ ఎమోషనల్ అవుతుంది. చివరగా పవన్ దగ్గరకు వచ్చి నువ్వు నాతో మాట్లాడకని గట్టిగా అరుస్తుంది. దానికి పవన్ కూడా ఎందుకరుస్తున్నావని గట్టి సమాధానమే చెబుతాడు. మొత్తానికి ఈ ప్రోమో అయితే కొంతమందిని బాధపెడుతోంది. ఇక ఈ వారం నామినేషన్స్ పూర్తి కాగా.. రీతూ, సంజన, డిమాన్ పవన్, కళ్యాణ్, భరణితో పాటు 10 వారాలపాటు సేఫ్ అయిన ఇమ్ము కూడా 11 వారంలో నామినేషన్స్‌లో ఉండటం గమనార్హం.






