- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్‌బాస్-9: కళ్యాణ్ పీకపట్టుకున్నమరో కంటెస్టెంట్.. అతనితో పాటు సంజనకు రెడ్ కార్డ్ ఇవ్వాలంటూ నెటిజన్ల డిమాండ్? (వీడియో)
బిగ్‌బాస్ షో ప్రతి వారం కొత్తగా ప్రేక్షకులను అలరిస్తోంది. గతవారం ఫ్యామిలీ వీక్ కావడంతో అంతా ప్రశాంతంగా ఉన్నారు.

దిశ, సినిమా: బిగ్‌బాస్ షో ప్రతి వారం కొత్తగా ప్రేక్షకులను అలరిస్తోంది. గతవారం ఫ్యామిలీ వీక్ కావడంతో అంతా ప్రశాంతంగా ఉన్నారు. ఇక నామినేషన్స్ లేకుండా ఇమాన్యుయేల్ తన పవర్ అస్రాను ఉపయోగించడంతో దివ్య సేఫ్ అయింది. ఇక ఈ వారం నామినేషన్స్ జరగ్గా.. ఓ ఇద్దరు కంటెస్టెంట్స్ ఊహించని విధంగా రెచ్చిపోయారు. హద్దులు దాటి ప్రవర్తించడంతో వారిపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఎలాగైనా ఆ ఇద్దరికి రెడ్ కార్డ్ ఇవ్వాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతలా అసలు వాళ్లు ఏం చేశారో ఇక్కడ తెలుసుకుందాం. తాజాగా, విడుదలైన ప్రోమోలో.. నామినేషన్స్ ప్రక్రియలో సంజన, డిమాన్ పవన్ హైలెట్ అయ్యారు. ఇందులో గత వారం ఆడిన కెప్టెన్సీ టాస్క్ పరంగా చూసుకుని ఇమ్మును నామినేట్ చేస్తూ డిమాన్ పవన్ ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలోనే.. కళ్యాణ్ ఇందులోకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ ఫైర్ అయ్యాడు.
వెర్వేరు టీమ్స్‌లో ఉండగా.. పవన్, ఇమ్ముతో చేసుకున్న డీల్ ఎంటనీ రీతూను అడిగాడు. ఆరోజు ఇమ్ముతో డీల్ మాట్లాడుకున్నా అని నా మీద అరిచి నింద వేశావ్.. ఇప్పుడు పవన్ చేసింది ఏంటనీ రీతూపై కళ్యాణ్ రెచ్చిపోయాడు. ఆమె కూడా ఫైర్ బ్రాండ్‌లా మాట్లాడి కైంటర్ ఇచ్చింది. ఈసమయంలోనే కళ్యాణ్ కోపంతో చైర్‌ను తన్నాడు. ఒకరిపై ఒకరు వెళ్లేందుకు యత్నించగా.. మిగతా కంటెస్టెంట్స్ అడ్డుకున్నారు. ఆ తర్వాత డిమాన్ పవన్(Diman Pawan), కళ్యాణ్ (Kalyan)పీకపట్టుకున్నట్లు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఆ తర్వాత రీతూ, ఫైర్ స్ట్రామ్స్ వచ్చినప్పటి నుంచి మీ గేమ్ కనిపించలేదని సంజనను నామినేట్ చేయగా.. ఆమె ఫైర్ అయిపోయి పర్సనల్ విషయాలు మాట్లాడేసింది. నీ అంత బూతులు ఎవరూ వాడలేదు. నీలాంటి స్ట్రాటజీలు ఈ హౌస్‌లో ఎవరికీ లేదు.
పవన్‌తో నువ్వు రాత్రి కూర్చుంటావ్.. కళ్లు మూసుకోవాల్సి వస్తుంది అని నోరుజారింది. దీంతో ఫైర్ అయిన రీతూ బిగ్‌బాస్ నేను ఏం తప్పు చేశానో చెప్పాలంటూ అరిచింది. ఈసమయంలోనూ ఇమాన్యుయేల్ సంజన మాట్లాడిన మాటలు తప్పు అని వెనక్కి తీసుకోమని చెప్తాడు. అయినప్పటికీ సంజన వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇప్పటికే ఎన్నోసార్లు సంజనకు నాగార్జున వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎలా పడితే అలా మాట్లాడి క్షమాపణలు అడగొద్దని చెప్పాడు. అయినప్పటికీ ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక ఈ గొడవలో ప్రోమో అయిపోయింది. ఇది చూసిన వారంతా పవన్, సంజనకు రెడ్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వారం రీతూ కెప్టెన్ అయినందున సేఫ్ కాగా.. మిగతా కంటెస్టెంట్స్ డిమాన్ పవన్, కళ్యాణ్, దివ్య, తనూజ, భరణి, సుమన్ శెట్టి, సంజన, ఇమాన్యుయేల్ ఈ వారం నిమనేషన్స్‌లో ఉన్నారు.






