- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేక్షకుల మనసుల్ని గెలిచిన ఇమ్మాన్యుయేల్ పారితోషికం ఎంతో తెలుసా?
by Naga Rani Yarlagadda |
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ప్రేక్షకులు ఊహించనిది ఏదైనా జరిగింది అంటే అది ఇమ్ము ఎలిమినేషన్.

X
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ప్రేక్షకులు ఊహించనిది ఏదైనా జరిగింది అంటే అది ఇమ్ము ఎలిమినేషన్. టాప్ 4 ప్లేస్ లో ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో అందరూ షాకయ్యారు. అతని ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటూ మండిపడుతున్నారు. 4వ స్థానంలో ఎలిమినేట్ అయిన ఇమ్మాన్యుయేల్ ఎంత పారితోషికం అందుకున్నాడన్న విషయం ఆసక్తికరంగా మారింది. హౌస్ లోకి వెళ్లిన ఇమ్మాన్యుయేల్ 105 రోజులు ఉండగా.. రోజుకు రూ.35 వేలు చొప్పున వారానికి రూ.2.25 లక్షలు రెమ్యూనరేష్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇలా 15 వారాలకు గాను రూ.33,75,000 అందుకున్నట్లు తెలుస్తోంది. ఇది అంత చిన్న అమౌంట్ ఎంతమాత్రం కాదు. ఆల్మోస్ట్ విన్నర్ రేంజ్ పారితోషికం. ఏదేమైనా ఇమ్మాన్యుయేల్ ను ఫోర్త్ ప్లేస్ లో పడేయడం ఎవరికీ నచ్చలేదు. అతను ఓడిపోయినా సరే.. రియల్ హీరో ఇమ్మూనే అంటున్నారు ఫ్యాన్స్.
Next Story






