బిగ్‌బాస్-9: వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ ముగ్గురు సామాన్యులు .. కానీ ఓ బిగ్ ట్విస్ట్‌..!

by Mallepaka Hamsa |

బిగ్‌బాస్-9: వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ ముగ్గురు సామాన్యులు .. కానీ ఓ బిగ్ ట్విస్ట్‌..!
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ సీజన్-9 (Bigg Boss Season-9)సెప్టెంబర్ 7న ప్రారంభం అయి ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఇందులో 15 మంది కంటెస్టెంట్స్ ఇంట్లోకి వెల్లగా.. ఇందులో 9 మంది సెలబ్రిటీలు ఉన్నారు. ఇక ఈ సీజన్‌లో 6మంది సామాన్యులు పాల్గొనడం విశేషం. అగ్నిపరీక్ష పేరుతో పలు టాస్కులు పెట్టి వారిని సెలెక్ట్ చేసి హౌస్‌లోకి పంపారు. బిగ్‌బాస్ షో మొదలై ఇప్పటికే రెండు వారాలు పూర్తి కాగా ఒక సెలబ్రిటీ శ్రేష్టి వర్మ, ఒక కామనర్ మర్యాద మనీష్ ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చారు. మొత్తం హౌస్‌లో 13 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. రోజు రోజుకు చాలా రసవత్తరంగా మారుతోంది. నిత్యం పలు గొడవలు పెట్టుకుంటూ హౌస్‌మెట్స్‌తో ప్రేమ వ్యవహారాలు కూడా నడుపుతున్నారు.

ఇక ఈ వారం నామినేషన్స్‌లో 6మంది కంటెస్టెంట్స్ ఉండగా.. అందులో ఒకరు ఇంటి నుంచి బయటకు రాబోతున్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్‌లో ఫ్యామిలీతో మాట్లాడించే టాస్క్ కొనసాగుతోంది. ఈక్రమంలో.. తాజాగా, బిగ్‌బాస్‌లోకి మరో ఇద్దరు సామాన్యులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ముందుగా నాగ ప్రశాంత్(naga prashanth), షకీబ్, (shakib)దివ్య నిఖిత(diyva nikitha) ఇంట్లోకి వెళ్లి ఒక రోజు అక్కడే ఉండి టాస్కుల్లో పాల్గొనబోతున్నట్లు టాక్. ఇక అందులో నెగ్గిన వారు హౌస్‌మేట్‌గా ఎంపిక చేయనున్నారట. అలా రెండు వారాలు చేసి ఇద్దరిని ఇంట్లో ఉంచి.. ముందుగా వెళ్లిన కామనర్స్‌లోంచి ఇద్దరిని బయకటు పంపబోతున్నారట బిగ్‌బాస్ నిర్వాహకులు. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేసి అయినా సరే వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు దింపనున్నట్లు పలు వార్తలు వస్తున్నాయి.

Next Story