- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్‌బాస్-9: హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన ఎలిమినేట్ అయిన ఆ ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్.. బిగ్ ట్విస్ట్‌తో అంతా షాక్?
బిగ్‌బాస్-9 అన్ని సీజన్లకంటే విభిన్నంగా ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఈ సారి కామనర్స్‌తో పాటు సెలబ్రిటీలను కూడా హౌస్‌లోకి పంపించి గేమ్స్ ఆడిస్తున్నారు.

దిశ, సినిమా: బిగ్‌బాస్-9 అన్ని సీజన్లకంటే విభిన్నంగా ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఈ సారి కామనర్స్‌తో పాటు సెలబ్రిటీలను కూడా హౌస్‌లోకి పంపించి గేమ్స్ ఆడిస్తున్నారు. ఈ షోలో ఈ వారం నామినేషన్స్ చేసేందుకు ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరినీ మళ్లీ హౌస్‌లోకి పంపించారు. వారితో పలు నెగెటివ్ పాయింట్లు చెప్పించి హౌస్‌మెట్స్‌ను నామినేట్ చేసేలా ప్లాన్ చేశారు. అంతేకాకుండా అక్టోబర్ 29న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల అయింది ఇందులో.. ఎలిమినేట్ అయిన స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ శ్రీజ(sreeja), భరణి(Bharani)లను మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు.
వీరిలో ఒక్కరు మాత్రమే హౌస్‌లో ఉంటారని బిగ్‌బాస్ ప్రకటించిన బిగ్‌బాస్ అందరినీ షాక్‌కు గురి చేశాడు. అలాగే కొంతమంది సైనికులుగా ఎంచుకోమని చెప్పి.. ఇద్దరు ఓ గేమ్ ఆడాలని చెప్పాడు. పర్మినెంట్ హౌస్‌మెట్‌గా మారాలనుకున్న వారు గేమ్‌లో గెలిస్తే ఇంట్లో ఉంటారు లేదంటే మళ్లీ బయటకు పోతారని అంటాడు. కట్టు పడగొట్టు ఆటలో భాగంగా తమకు ఇచ్చిన బ్లాక్స్‌తో ఏడంతస్తుల టవర్ నిర్మించాలి.. ప్రత్యర్థి టీమ్‌ను పడగొట్టాలి. బజార్ మోగేవరకి ఎవరివి ఎత్తుగా ఉంటే వారే గెలుస్తారని అంటాడు. ఇక ఈ గేమ్‌లో పోటాపోటీగా భరణి, శ్రీజలతో పాటు మిగతా కంటెస్టెంట్స్ కూడా ఆడతారు.
ఇక ఇందులో భరణి గెలిచినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని శ్రీజ టీమ్ ఒప్పుకోకపోగా.. ఈ గేమ్‌లో సంచాలకులుగా ఉరన్న కళ్యాణ్, సుమన్ శెట్టి కాసేదు వాదించుకుంటారు. కళ్యాణ్ శ్రీజ గెలిచిందని ప్రకటించగా.. సుమన్ ఫైర్ అయిపోయి నా నిర్ణయం ప్రకారం భరణి గారి టీమ్ గెలిచిందని ప్రకటిస్తాడు. అంతటితో ప్రోమో అయిపోయింది. ఇక చివరకు బిగ్‌బాస్ ఇద్దరిలో ఎవరు గెలిచారు.. హౌస్‌లో కంటెస్టెంట్ కొనసాగేది ఎవరనేది చెప్పి ట్విస్ట్ ఇవ్వబోతున్నారు.






