బిగ్‌బాస్-9: రీఎంట్రీలోనూ కలిసిరాని అదృష్టం.. ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసిన ఆ కంటెస్టెంట్?

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-23 15:44:33  IST  )

బిగ్‌బాస్ సీజన్ -9 మిగతా సీజన్లకు పూర్తి భిన్నంగా ఉందన్న విషయం తెలిసిందే.

బిగ్‌బాస్-9: రీఎంట్రీలోనూ కలిసిరాని అదృష్టం.. ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసిన ఆ కంటెస్టెంట్?
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ సీజన్ -9 మిగతా సీజన్లకు పూర్తి భిన్నంగా ఉందన్న విషయం తెలిసిందే. ఇందులో కామనర్స్, సెలబ్రిటీలు పాల్గొనగా.. ఇటీవల ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ శ్రీజ(sreeja), భరణి(bharani)లకు మరోసారి అవకాశం ఇచ్చాడు. వీరిని ఇంట్లోకి పంపించి.. హౌస్‌లో కంటెస్టెంట్‌గా మరోసారి ఉండేందుకు పలు టాస్కులు కూడా పెట్టాడు. ఇక కొన్ని టాస్కుల్లో భాగంగా భరణి గెలవగా.. శ్రీజ తన అటిట్యూడ్‌తో ఇంటినుంచి మరోసారి ఎలిమినేట్ అయిపోయింది. ఆ తర్వాత ఈ వారం కెప్టెన్సీ కంటెండర్లుగా ఐదుగురిని సెలెక్ట్ చేయమని భరణికి పవర్ ఇవ్వగా.. తనూజ, దివ్య, సాయి, నిఖిల్‌ను సెలెక్ట్ చేశాడు.

దీంతో రీతూ ఫుల్ ఫైర్ అయిపోయింది.ఈ టాస్కులో భాగంగా పాటలు ప్లే అవుతూ ఉంటే ఒక్కో కంటెండర్ డ్యాన్స్ చేయాలి. వారికి సపోర్ట్ చేసేవారు మరో ఫ్లాట్‌ఫామ్‌పైకి ఎక్కి పాట ఆగిపోయేవరకు డ్యాన్స్ చేస్తుండాలి. మ్యూజిక్ ఆగే సమయానికి ఎవరి ఫ్లాట్‌ఫామ్‌పై ఎక్కువమంది సపోర్టర్స్ ఉంటే వారే గెలిచనట్లు. రాము సంచాలక్‌గా వ్యవహరించాడు. ఇక ఈ టాస్కులో తనూజ, దివ్యకు పోటాపోటీగా సపోర్ట్ చేశారు. దీంతో రెండో రౌండ్ ఆడగా.. ఇందులో ఒక్క ఓటు తేడాతో దివ్య గెలిచి కెప్టెన్ అయింది. దీంతో తనూజ ఏడ్చేసింది.

Next Story