- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్‌బాస్-9: టాస్కులో తీవ్రంగా గాయపడిన స్ట్రాంగ్ కంటెస్టెంట్.. వైరల్‌గా మారిన వీడియో
ఎంతో ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్ సక్సెస్‌ఫుల్‌గా పలు సీజన్లను పూర్తి చేసుకుంటుంది.

దిశ, సినిమా: ఎంతో ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్ సక్సెస్‌ఫుల్‌గా పలు సీజన్లను పూర్తి చేసుకుంటుంది. అన్ని భాషల్లో ఈ షోలో ఎంతో మంది పాల్గొంటూ ఫేమస్ అయిపోతున్నారు. ఈ షో టీఆర్పీతో పాటు రేటింగ్స్‌లోనూ టాప్ ప్లేస్‌లో దూసుకుపోతుంది. ఇక తెలుగులో ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుని సీజన్ 9 కొనసాగుతుంది. అలాగే తమిళంలోనూ బిగ్‌బాస్ షో విజయవంతంగా 8వసీజన్లు పూర్తి చేసుకుని 9వసీజన్‌లోకి అడుగుపెట్టింది. ఈ షోకు విజయ్ సేతుపతి(Vijay Sethupathi) హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. రోజు రోజుకు బిగ్‌బాస్ కష్టతరమైన టాస్కులు ఇస్తూ.. కంటెస్టెంట్స్‌కు చుక్కలు చూపిస్తున్నారు. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కంటెస్టెంట్స్ దెబ్బలు తగిలించుకుని మరీ టాస్కుల్లో పాల్గొంటున్నారు.
తాజాగా, విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇందులో బిగ్‌బాస్ ఓ టాస్కులో భాగంగా నటి వీజే పార్వతి తీవ్రంగా గాయపడింది. ఇతర హౌస్‌మెట్స్‌తో పోటీపడి గేమ్ ఆడుతుండగా.. కన్ను భాగంలో వాచిపోయింది. BB బాటిల్ హంట్ అనే టాస్క్ లో భాగంగా శబరీ నాథ్(Sabari Nath) తానే కంటెస్టెంట్ చేతిలో ఆమెకు గాయం అయ్యింది. అయినప్పటికీ గేమ్ ఆడతానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా టాప్‌లో కొనసాగుతుంది. టాస్క్‌లో భాగంగా పొరపాటున శబరీనాథ్ మోకాలు పార్వతి కంటికి చాలా బలంగా తగిలింది. దాంతో ఆమె నొప్పితో తల్లడిల్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు అయ్యో పాపం అని కామెంట్లు పెడుతున్నారు. అలాగే నిర్వాహకులపై మండిపడుతున్నారు.






