- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్‌బాస్-9: హౌస్‌లో షాకింగ్ ఎలిమినేషన్.. బయటకు రాబోతున్న ఆ ఇద్దరు కంటెస్టెంట్స్
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ 9సీజన్ సక్సెస్‌ఫుల్‌గా అన్ని సీజన్లకు విభిన్నంగా కొనసాగుతోంది.

దిశ, సినిమా: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్9(Bigg Boss Season 9) సక్సెస్‌ఫుల్‌గా అన్ని సీజన్లకు విభిన్నంగా కొనసాగుతోంది. ఇక ఇందులో పదో వారం కొనసాగుతుండగా.. మరో నాలుగు వారాలకు గ్రాండ్ ఫినాలేకు చేరుకోనుంది. ప్రస్తుతం 11మంది హౌస్‌మెట్స్ ఉండగా.. రోజు రోజుకు తమ గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు. అలాగే ఎలిమినేట్ అవకుండా సేఫ్ అవుతున్నారు. గత వారం రాము సెల్ఫ్ ఎలిమినేట్ కాగా.. సాయి శ్రీనివాస్ తక్కువ ఓట్లు వచ్చినందున హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. ఇక ఈ వారం నామినేషన్స్‌లో మొత్తం 9 మంది ఉన్నారు. డిమాన్ పవన్, సంజన, సుమన్ శెట్టి, రీతూ చౌదరి, భరణి, గౌరవ్, నిఖిల్, కళ్యాణ్,దివ్య నామినేట్ అయ్యారు.
ఇమాన్యుయేల్ కెప్టెన్ కావడంతో సీక్రెట్‌గా నామినేట్ చేయమని బిగ్‌బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చినప్పటికీ హౌస్‌మెట్స్ చేయకపోవడంతో ఎప్పటిలాగే ఈ వారం సేఫ్ అయ్యాడు. తనూజ కూడా సేఫ్ అయింది. అయితే ఇందులో పవన్, సుమన్ శెట్టి ఓటింగ్ పరంగా ముందున్నట్లు సమాచారం. ఆ తర్వాత రీతూ, భరణి, సంజన ఉండగా.. దివ్య(divya), గౌరవ్(Gaurav), నిఖిల్ (Nikhil)డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో గేమ్ పరంగా చూసుకుంటే దివ్య అన్ని టాస్కుల్లో బాగా ఆడినందున ఆమె సేఫ్ కాగా.. నిఖిల్‌ను బయటకు పంపేశారు. అలాగే ఈ రోజు జగరబోయే ఎపిసోడ్‌లో గౌరవ్‌ను కూడా ఇంటి బయటకు తీసుకురాబోతున్నట్లు సమాచారం.
READ MORE ....
బిగ్‌బాస్-9: నేను చచ్చిపోతా.. నా వల్ల కావడం లేదంటూ బోరున ఏడుస్తున్న సంజన.. అయినా కనికరించని నాగ్






