బిగ్‌బాస్-9: షాకింగ్ ఎలిమినేషన్.. ఈ వారం ఊహించని కంటెస్టెంట్ ఔట్!

by Mallepaka Hamsa |

బిగ్‌బాస్ సీజన్-9 చివరి దశకు చేరుకుంది. కొద్ది రోజుల్లో ఫినాలేకు చేరుకోనున్న ఈ సీజన్‌ రేండు వారాల్లో షో పూర్తి కానుంది.

బిగ్‌బాస్-9: షాకింగ్ ఎలిమినేషన్.. ఈ వారం ఊహించని కంటెస్టెంట్ ఔట్!
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ సీజన్-9 చివరి దశకు చేరుకుంది. కొద్ది రోజుల్లో ఫినాలేకు చేరుకోనున్న ఈ సీజన్‌ రేండు వారాల్లో షో పూర్తి కానుంది. నిర్వాహకులు ఊహించని మార్పులు చేసినప్పటికీ .. కొందరు కంటెస్టెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోగా ఇంట్లో ఇంకా ఏడుగురు ఉన్నారు. ఇక ఎప్పటిలానే వీకెండ్ ఎసిసోడ్ రానేవచ్చింది. ఇంట్లో ఉన్నవారందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వారం నామినేషన్స్‌లో తనూజ, భరణి, సంజన, డిమాన్ పవన్(Diman Pawan), సుమన్ శెట్టి(Suman Shetty), రీతూ చౌదరి(Rithu Chowdary), ఉండగా.. కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్‌ అవడంతో సేఫ్ అయ్యాడు.

ఇక మిగతా ఆరుగురిలో ఈ వారం రీతూ చౌదరి ఇంటినుంచి బయటకు రాబోతున్నట్లు సమాచారం. గత వారంలో జరిగిన హంగామా వల్ల లెక్కలన్నీ మారిపోయినట్లు తెలుస్తోంది. రీతూ, పవన్ మధ్య ఉన్న బంధం గురించి సంజన కొన్ని కామెంట్స్ చేయగా.. రెచ్చిపోయింది. అయినప్పటికీ చివరగా.. సంజనతో నాగ్ క్షమాపణలు చెప్పించాడు. లేదంటే బయటకు పంపుతా అని గేట్స్ కూడా ఓపెన్ చేయగా.. చివరకు గొడవ సర్దుమనగడంతో ఇంట్లోనే ఉంది. ఇక ఈ వారం కాస్త రీతూకి తక్కువ ఓట్లు రావడం మూలంగా ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఆమె బయటకు రాగా.. ఆదివారం ఎపిసోడ్‌లో చూపించనున్నట్లు టాక్. రీతూ ఫైనల్ లిస్ట్‌లో ఉంటుందని చాలామంది భావించారు.. కానీ చివరి నిమిషంలో ఊహించని విధంగా ఎలిమినేట్ కావడంతో కాస్త అయోమయంలో ఉన్నారు. ఇక మిగతా ఐదుగురిలో ఫైనలిస్ట్‌లోకి ఎవరు వెళ్తారా? మిగిలిన వారు ఒకరు వచ్చే వారం ఎవరు బయటకు వచ్చారా? అనే విషయంపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అప్పుడే.. అంచనా వేయడం కూడా మొదలెట్టారు.

Next Story