బిగ్‌బాస్-9: నేను చచ్చిపోతా.. నా వల్ల కావడం లేదంటూ బోరున ఏడుస్తున్న సంజన.. అయినా కనికరించని నాగ్

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-23 15:57:53  IST  )

బిగ్‌బాస్ సీజన్-9(Bigg Boss Season-9) పదోవారంలో భాగంగా వీకెండ్ వచ్చేసింది.

బిగ్‌బాస్-9: నేను చచ్చిపోతా.. నా వల్ల కావడం లేదంటూ బోరున ఏడుస్తున్న సంజన.. అయినా కనికరించని నాగ్
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ సీజన్-9(Bigg Boss Season-9) పదోవారంలో భాగంగా వీకెండ్ వచ్చేసింది. ఇక ఇందులో నాగార్జున హౌస్‌లో మీకు సపోర్ట్‌గా ఉన్నదెవరు? మీ ఆటను ముంచుతున్నదెవరు అని హౌస్‌మెట్స్‌కు ఓ టాక్స్ ఇచ్చాడు. ఇక ఇందులో మెజారిటీ ఇంటి సభ్యులు సంజన పేరు చెప్పడంతో..నాగ్ బిగ్ బాంబ్ పెల్చాడు. ఆమెకు ఫ్యామిలీని కలుసుకునే అవకాశాన్ని తీసేశాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న సంజన (Sanjana)బోరున ఏడ్వటం మొదలెట్టింది. ‘‘నేను ఇంటికి వెళ్లిపోతాను నా వల్ల కాదు. నేను చచ్చిపోతా.. రోజుకు ఆరు సార్లు ఏడుస్తున్నాను. ఇంకా నా వల్ల కాదు. నేనిక్కడ ఉండలేకపోతున్నాను బిగ్‌బాస్ నన్ను బయటకు పంపించండి. ఇది నేను పొగరుతో చెప్పడం లేదు. బతిమాలుతున్నాను నాగార్జున సార్ నన్ను బయటకు పంపండి’’ అని ఏడుస్తూ చెప్పింది.

దీంతో ఆమె బాధను చూడలేక భరణి, కళ్యాణ్ తమ ఫ్యామిలీ వీక్‌ను త్యాగం చేసేందుకు సిద్ధమయ్యారు. అయినా కనికరించని నాగార్జున అందుకు ఒప్పుకోలేదు. నా చేతుల్లో ఏమీ లేదు.. హౌస్‌మెట్స్ నిర్ణయం మేరకే ఇదంతా జరుగుతుందని అందరికీ షాకిచ్చాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఇదంతా పీ ఆర్పీ రేటింగ్ కోసం చేసిన ప్లాన్ అని చర్చించుకుంటున్నారు. గత సీజన్‌లో కూడా తేజకు అలాగే చేప్పారు.. కానీ చివర్లో తన తల్లిని లోపలికి పంపించారని అంటున్నారు. ఇక ఈ సారి కూడా అలాగే జరగనుంది. ఆమెకు ఎంతోమంది అభిమానులు ఉన్న కారణంగా.. సంజనను టీఆర్పీ రేటింగ్ కోసం వాడుకున్నారని కామెంట్లు పెడుతున్నారు.

Next Story