- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్‌బాస్-9: దీపావళి సందర్భంగా కంటెస్టెంట్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన నాగ్.. ఏడుపు వస్తుందంటూ నెటిజన్ల కామెంట్స్
రియాలిటీ షో బిగ్‌బాస్ ఆరోవారం పూర్తి కావొస్తుంది. ఇక ఇంట్లో పాత కంటెస్టెంట్స్‌తో పాటు వైల్డ్ కార్డ్స్‌తో కళకళలాడుతోంది.

దిశ, సినిమా: రియాలిటీ షో బిగ్‌బాస్ ఆరోవారం పూర్తి కావొస్తుంది. ఇక ఇంట్లో పాత కంటెస్టెంట్స్‌తో పాటు వైల్డ్ కార్డ్స్‌తో కళకళలాడుతోంది. దాదాపు 16 మంది కంటెస్టెంట్స్‌తో బిగ్‌బాస్ టాస్కులతో రఫ్ఫాడిస్తున్నాడు. తాజాగా, ఆదివారం ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేయగా.. ఇందులో నాగార్జున (Nagarjuna)రాకతో దీపావళి మొదలైపోయింది. తన ఎంట్రీతోనే పండు వాతావరణం క్రియేట్ చేసిన నాగ్ కంటెస్టెంట్స్ అందరికీ కొత్త బట్టలు పంపించాడు. ఆ తర్వాత పలు టాస్కులు పెట్టగా.. బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీపావళి మీ ఇంట్లో ఎంటర్‌టైన్‌మెంట్ బ్లాస్ట్ బిగ్‌బాస్‌లో అని అన్నారు. ఇక ఈ గేమ్స్‌లో విన్నర్స్‌గా గెలిచిన వారికి తమ కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన స్పెషల్ వీడియో మెసేజ్‌లను చూపించారు. ఇందులో సుమన్ శెట్టి, డిమాన్ పవన్(Diman Pawan), సంజన(Sanjana) ఫ్యామిలీస్‌ను చూపించగా.. సంజన భర్త తన ఇద్దరు పిల్లలతో కనిపించారు.తన ఐదు నెలల కూతురిని, కొడుకుని, భర్తను చూసిన సంజన బోరున ఏడ్చేసింది. దీంతో ఈ ప్రోమో అయిపోయింది. ఇక అది చూసిన నెటిజన్లు మాకూడా ఏడుపు వస్తుందని కామెంట్లు పెడుతున్నారు.






