బిగ్‌బాస్-9: ఈ వారం డేంజర్ జోన్‌లో ఎంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారంటే?

by Mallepaka Hamsa |

ఈ సారి నామినేషన్స్‌ను బిగ్‌బాస్ కాస్త కొత్తగా ప్లాన్ చేశాడు.

బిగ్‌బాస్-9: ఈ వారం డేంజర్ జోన్‌లో ఎంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారంటే?
X

దిశ, సినిమా: ఈ సారి నామినేషన్స్‌ను బిగ్‌బాస్ కాస్త కొత్తగా ప్లాన్ చేశాడు. హౌస్ ఉన్నవారితో కాకుండా ఎలిమినేట్ అయి ఇంటి నుంచి బయటకు వెళ్లిన మాజీ కంటెస్టెంట్స్‌తో చేయించ హీట్ పెంచారు. ఒక కత్తితో వారే స్వయంగా వచ్చి నామినేట్ చేయడంతో పాటు వాళ్లు ఆ కత్తిని ఎవరికి ఇస్తారో వాళ్లు కూడా ఒకరిని నామినేట్ చేయోచ్చు. అంటే ఒకేసారి డబుల్ ధమాకా అన్నట్లు.. ఇద్దరు ఒక్కరినే నామినేట్ చేయాలనే రూల్ లేదు. కాబట్టి ఎవరికి నచ్చని వారిని వారు చేసుకోవచ్చమాట. ఇక ఇందులో మనీష్, శ్రీజ, ప్రియ, ఫ్లోరా, భరణి. శ్రష్టి వర్మ ఇంట్లోకి వచ్చి తమ అభిప్రాయాల ప్రకారం కొంతమంది గేమ్ సరిగ్గా ఆడట్లేదని కత్తితో పొడిచేసి నామినేట్ చేశారు.

చివరగా.. ఈ వారం నామినేషన్స్‌లో రీతూ, తనూజ, డిమాన్ పవన్, గౌరవ్, సంజన, కళ్యాణ్, రాము, మాధురితో కలిపి 8 మంది నామినేట్ అయ్యారు. ఇక ఇందులో రాము, మాధురి డేంజన్‌లో ఉన్నట్లు సమాదారం. అందరితో పోలిస్తే వీరిద్దరికి ఈ మూడు రోజుల్లో తక్కవు ఓట్లు పడినట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరికొందరు మాత్రం మాధురి వచ్చినప్పటి నుంచి అందరితో పంచాయితీ పెట్టుకుంటుంది కాబట్టి రమ్య లాగా ఆమెను కూడా బయటకు పంపించే బాగుంటుందని అంటున్నారు.

Next Story