- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్‌బాస్-9: అప్పుడే విన్నర్ ఎవరో తెల్చేసిన గూగుల్.. షాక్‌లో నెటిజన్లు?
బిగ్‌బాస్ సీజన్-9 గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది. మరికొద్ది రోజుల్లో ఈ సీజన్ ముగియనుంది.

దిశ, సినిమా: బిగ్‌బాస్ సీజన్-9 గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది. మరికొద్ది రోజుల్లో ఈ సీజన్ ముగియనుంది. ప్రస్తుతం హౌస్‌లో కళ్యాణ్(Kalyan), సుమన్ శెట్టి(Suman Shetty), తనూజ(Tanuja), ఇమాన్యుయేల్, భరణి, పవన్, సంజన ఉన్నారు. ఇక ఈ ఏడుగురిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయి బయటకు వచ్చేస్తారా? ఎవరు విన్నర్ అవుతారా? రన్నర్‌గా ఎవరు నిలుస్తారా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇప్పటికే మొదటి ఫైనలిస్ట్‌గా కళ్యాణ్ నిలిచాడు. సెకండ్ ఫైనలిస్ట్ కోసం టాస్కులు కూడా జరుగుతున్నాయి. ఇక ఇన్ని జరుగుతున్న ఈ షోపై ప్రేక్షకుల్ల ఉత్కంఠ నెలకొంది. అసలు ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారా? అనే అంచనాలు మొదలయ్యాయి. ఇక ఇన్నాళ్లు తనూజ విన్నర్ అవుతుంది.. అనుకున్న వారికి బిగ్ షాక్ తగిలినట్లు అవుతోంది.
ఊహించని విధంగా.. కళ్యాణ్ రేస్‌లోకి వచ్చాడు. టాస్కుల్లో తన సత్తా చాటుతూ పాపులారిటీని మరింత పెంచుకుంటున్నాడు. దీంతో తనూజ రెండో స్థానంలో నిలుస్తోంది. ఈక్రమంలో.. తాజాగా, విన్నర్, రన్నర్ పేర్లను ఏఐ ఫైనల్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బిగ్‌బాస్ విన్నర్ ఎవరు అని గూగుల్ ఏఐని అడిగితే.. కళ్యాణ్ పడాల అని చూపిస్తోంది. అంతేకాకుండా తనూజ రన్నర్ అని చెప్పేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ వార్తలు చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఈ విషయాన్ని చూసిన నెటిజన్లు మాత్రం ఇద్దరు గ్రూపులుగా విడిపోయారు. తనూజ ఫ్యాన్స్… “అంతకాలం స్ట్రాంగ్‌గా ఆడింది, ఆమె విన్నర్ అవ్వాలి” అని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు కళ్యాణ్ సపోర్టర్స్… “గత రెండు వారాల నుంచి టాస్కుల్లో డామినేట్ చేస్తున్నాడు, విన్నర్ అవ్వడం ఖాయం” అంటూ రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది ఫన్నీ మీమ్స్‌తో “బిగ్‌బాస్ టీమ్‌కంటే గూగుల్ ఏఐ ముందే రిజల్ట్ చెప్పేసింది” అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు. అలాగే తనూజని కాకుండా చివరల్లో టాస్కులు ఆడుతున్న కళ్యాణ్‌ను ఎలా విన్నర్ చేస్తారని ? కొందరు అంటున్నారు. ఇక ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
READ MORE .....
కళ్యాణ్ గురించి అసలు నిజాలు చెప్పిన జవాన్.. వీడియో వైరల్






