- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్‌బాస్-9: తనూజకు డబుల్ షాక్.. మొత్తానికి హౌస్‌లో బాండింగ్స్‌కు ఎండ్ కార్డ్!
‘ముద్ద మందారం’ సీరియల్ ద్వారా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న తనూజ(tanuja) రియాలిటీ షో బిగ్‌బాస్‌లోకి కంటెస్టెంట్‌గా ఇంట్లోకి వెళ్లింది.

దిశ, సినిమా: ‘ముద్ద మందారం’ సీరియల్ ద్వారా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న తనూజ(tanuja) రియాలిటీ షో బిగ్‌బాస్‌లోకి కంటెస్టెంట్‌గా ఇంట్లోకి వెళ్లింది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ షోలో తనూజ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. రోజు రోజుకు టాస్కుల్లో చురుకుగ్గా పాల్గొంటూ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటోంది. మొదట ఎక్కువగా ఏడ్చినప్పటికీ.. ఆ తర్వా గేమ్ ఇంప్రూవ్ చేసుకుని టాప్ 5లో ఉండేలాగా ఆడుతూ హీట్ పుట్టిస్తోంది. ఇక భరణిని తండ్రి అని పిలిచిన తనూజ ఆయన ఎలిమినేట్ అయి ఇంటి నుంచి వెళ్లిపోయనప్పుడు చాలా ఏడ్చేసింది.. డిప్రెషన్‌కు గురైంది. కానీ ఇటీవల మళ్లీ వచ్చిన భరణి(bharani), తనూజతో కాస్త దూరంగా ఉంటున్నాడు. ఈ తండ్రీ కూతురు ఇన్నాళ్లు నామినేట్ చేసుకోనప్పటికీ తొమ్మిదో వారంలో ఊహించినది జరిగింది. తాజాగా, నామినేషన్స్ ప్రోమో విడుదలైంది. ఇందులో భరణి సడెన్ షాకిచ్చాడు. తనూజను నామినేట్ చేస్తూ.. ఒక్కసారి బయటకు వెళ్లి వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి.. నువ్వు బయటకు పోవాలని తనూజను నామినేట్ చేశాడు.
నేను రెండుసార్లు సేవ్ చేసినా.. ఆమె ఒక్కసారి కూడా నన్ను సేవ్ చేయలేదని అంటాడు. తనూజ కారణంగానే హౌస్‌నుంచి బయటకు వెళ్లి వచ్చాను అన్నట్లుగా మాట్లాడారు. దీంతో తనూజ కూడా ఏమాత్రం తగ్గకుండా ఘాటుగా స్పందించింది. దీంతో హౌస్‌లో కాసేస్ వాతావరణం వేడెక్కింది. ఆ తర్వాత సం తర్వాత రౌండ్‌లో సంచాలకురాలిగా ఉన్న దివ్య, భరణిని నామినేట్ చేయడంతో హౌస్‌లో కొత్త మలుపు తెచ్చింది. ఇక నామినేషన్స్ పూర్తి అయ్యాక అంతా భయట కూర్చొని మాట్లాడుకుంటుండగా.. బిగ్‌బాస్ ఫోన్ చేసి మాట్లాడతాడు. ఇక ఫోన్ లిఫ్ట్ చేసిన తనూజను మిగతా హౌస్‌మెట్స్ తమ మాటలు వింటున్నారు అందరినీ దూరంగా పొమ్మను అని చెప్తాడు.
దీంతో తనూజ వారికి చెప్పగా.. ఆ తర్వాత ఆయన దేనిగురించి ఫోన్ చేశానో గెస్ చేయండి అంటారు. దీంతో ఒక లెటర్ వల్ల అని ఆమె అంటుంది అది కాదనడంతో షాక్ అవుతుంది. కంటెండర్ టాస్క్ మొదలైందని చెప్పి హౌస్‌మెట్స్‌తో చెప్పమని అంటాడు. అదే విషయాన్ని తనూజ హౌస్‌మెట్స్‌కి చెప్పినప్పటికీ వారు నమ్మరు. ఇంతలోనే రీతూ బిగ్‌బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు.. కానీ ఆమెకి అది కవర్ చేయడానికి రాక మనకి అలా చెప్తుందని సీరియస్‌గా అంటుంది. దీంతో షాక్ అయిన తనూజ కాదని చెప్పినా ఇంట్లో వాళ్ళు నమ్మరు. అంతటితో ప్రోమో పూర్తి అయింది. నామినేషన్స్‌తో పాటు హౌస్‌మెట్స్ నమ్మకపోవడంతో తనూజకు రెండు షాక్‌లు తగిలినట్లు అయింది. అలాగే భరణితో బాండింగ్‌కు ఎండ్‌కార్డ్ పడింది.






