- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్‌బాస్:-9: హౌస్‌లో ఊహించని ట్విస్ట్.. నామినేషన్స్‌లో ఎంతమంది ఉన్నారంటే!
బిగ్‌బాస్ సీజన్-9 పదో వారం కొనసాగుతోంది. ఇక ఈ 9 వారాలపై ఇమాన్యుయేల్ మాత్రం నామినేట్ కాకుండా సేఫ్ అవుతూ వస్తున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: బిగ్‌బాస్ సీజన్-9 పదో వారం కొనసాగుతోంది. ఇక ఈ 9 వారాలపై ఇమాన్యుయేల్ మాత్రం నామినేట్ కాకుండా సేఫ్ అవుతూ వస్తున్న విషయం తెలిసిందే. అలాంటిది ఈ పారి కెప్టెన్ అయినప్పటికీ పదో వారంలో మాత్రం బిగ్‌బాస్ సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇమ్ము కెప్టెన్ కాబట్టి నామినేషన్స్ నుంచి అవుతాడనుకుంటే.. బిగ్‌బాస్ మాత్రం నామినేట్ చేసే అవకాశాన్ని ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అది కూడా సీక్రెట్ నామినేషన్స్ అంటూ చెప్పాడు. అయినప్పటికీ ఇమ్ముని భరణి తప్ప ఎవరూ నామినేట్ చేయలేదు. నామినేషన్స్ విషయానికొస్తే.. భరణి దివ్యను నామినేట్ చేయగా.. ఆమె ఏం ఊరుకోలేదు గట్టిగానే సమాధానం చెప్పింది.
తండ్రీ, కూతురు బాండింగ్‌తో ఉన్న వీరిద్దరు సడెన్‌గా ఒకరిపై ఒకరు అరుచుకోవడంతో ఈ సారి నామినేషన్స్ హాట్ టాపిక్‌గా మారాయి. బాండింగ్స్‌లో నేనొక్కదానిని లేనని అనేసింది. అలాగే రీతూ, నిఖిల్ కూడా ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. దీంతో ప్రతి వారం, వారం నామినేషన్స్‌లో హీట్ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. ఇక ఈ వారం 10మంది హౌస్ మెట్స్ నామినేషన్స్‌లో ఉండటం గమనార్హం. భరణి, డిమాన్ పవన్(Diman Pawan), కళ్యాణ్, దివ్య, రీతూ చౌదరి(Ritu Chaudhary), నిఖిల్, కళ్యాణ్, సంజన, సుమన్ శెట్టి, గౌరవ్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఇక ఇమ్ము ఎప్పటిలానే సేఫ్ అయినట్లు సమాచారం. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. బిగ్‌బాస్ ఈ సీజన్‌లో ఏదో ట్విస్ట్ ఇవ్వబోతున్నాడని ఊహిస్తున్నారు.






