బిగ్‌బాస్-9: కంటెస్టెంట్స్‌కు బిగ్ ట్విస్ట్.. మిడ్ వీక్‌లో ఎలిమినేషన్.. డేంజర్ జోన్‌లో ఎవరున్నారంటే?

by Mallepaka Hamsa |

బిగ్‌బాస్ సీజన్-9 ఫైనల్‌కు వచ్చేసింది. సెప్టెంబర్ 7న మొదలైన ఈ షో ఈ సారి చాలా రసవత్తరంగా కొనసాగుతోంది.

బిగ్‌బాస్-9: కంటెస్టెంట్స్‌కు బిగ్ ట్విస్ట్.. మిడ్ వీక్‌లో ఎలిమినేషన్.. డేంజర్ జోన్‌లో ఎవరున్నారంటే?
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ సీజన్-9 ఫైనల్‌కు వచ్చేసింది. సెప్టెంబర్ 7న మొదలైన ఈ షో ఈ సారి చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. మిగతా సీజన్లతో పోలిస్తే ప్రతి రోజు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కి ట్విస్టుల మీద ట్విస్టులిస్తూనే ఉన్నాడు. ఇక మొదట 15 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వెళ్లగా.. అందరూ ఎలిమనేట్ కాగా.. ఫైనల్‌గా తనూజ, కళ్యాణ్, ఇమాన్యుయేల్(Emmanuel), భరణి, పవన్, సుమన్ శెట్టి(Suman Shetty), సంజన (Sanjana)టైటిల్ కోసం పోటీపడుతున్నారు. అయితే ఫినాలేకి టాప్‌-5 మాత్రమే ఇంట్లో మిగులుతారు. అంటే ఈ వారంలో కచ్చితంగా ఇద్దరు ఎలిమినేట్ అయి బయటకు రావాల్సిందే. ఈక్రమంలోనే.. తాజాగా, ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ గురువారమే మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారట బిగ్‌బాస్. ఇప్పటికే కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలవడంతో.. మిగతా ఆరుగురు నామినేషన్స్‌లో ఉండటంతో హౌస్‌లో టెన్షన్ మొదలైంది.

అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారా? అనే ఆతృత నెటిజన్లలో ఎక్కువ అయింది. ఇక ఓటింగ్ లెక్కల విషయానికొస్తే.. తనూజ ఎప్పటిలాగే టాప్‌లో ఉండగా.. భరణి, ఇమాన్యుయేల్, పవన్ కూడా సేఫ్ జోన్‌లో ఉన్నారట. కానీ సంజన, సుమన్ శెట్టి మాత్రం డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఓటింగ్ పరంగా సుమన్ చివరి స్థానంలో ఉన్నారట. సజన టాస్కుల్లో వీక్ అయినప్పటికీ ఓట్స్ బాగానే పడుతున్నాయట. తాజా సమాచారం ప్రకారం.. ఈ గురువారం సుమన్ శెట్టి బయటకు వచ్చే అవకాశాలు బాగానే ఉన్నాయని టాక్. ఇక ఆదివారం పాడు కూడా సంజన వచ్చేస్తుందని చర్చించుకుంటున్నారు. మరికొన్ని గంటల్లో ఈ విషయంపై క్లారిటీ రానుందట. టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరనేది తెలియాలంటే మాత్రం మరికొన్ని వెయిట్ చేయక తప్పదు.

Next Story