BiggBoss season:7 మొదటివారం నామినేషన్స్‌లో 8 మంది.. ఎవరెవరంటే?

by Hamsa |
BiggBoss season:7 మొదటివారం నామినేషన్స్‌లో 8 మంది.. ఎవరెవరంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత రేటింగ్ ఉన్న బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ అట్టహాసంగా, ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ట్విస్టులతో ఆరంభమైంది. హోస్ట్ నాగార్జున అనుక్షణం ఈ సీజన్‌ డిఫరెంట్‌గా ఉండబోతుంది. మీరు ఊహించుకున్నట్టు అసలే ఉండదు. అంతా ఉల్టా పుల్టా అంటూ పదే పదే చెప్పారు. వినోదాత్మకంగా, ఎమోషనల్‌గా కంటెస్టెంట్లు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు.

అయితే బిగ్‌బాస్ ఇంట్లోకి వెళ్లిన కంటెస్టెంట్లందరూ ఇంకా పూర్తిగా సెటిల్ కాకముందే.. తొలి వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నామినేషన్స్ కంటెస్టెంట్స్ ఇంట్లోకి వెళ్లిన రెండో రోజే జరిగాయి. అయితే ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అవకాశం ఉన్న వారు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం. ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్, గౌతమ్ కృష్ణ, రతిక, శోభా శెట్టి, సింగర్ దామిని నామినేషన్ లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం.

Read More: Nindu Noorella Saavasam 5thSep Episode: అమర్ని ఢీకొట్టిన భాగమతి.. తర్వాత ఏం జరగబోతోంది?

Next Story