- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bigg Boss-9: కంటెస్టెంట్స్‌కు బిగ్ షాక్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎంతమంది ఉన్నారంటే?
తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఆదరిస్తున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్-9’ నాలుగు వారాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఆదరిస్తున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్-9’ నాలుగు వారాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో ఎప్పటిలాగానే 15 మంది కంటెస్టెంట్స్ వెల్లగా.. ఇందులో 9 మంది సెలబ్రిటీలు, 6మంది కామనర్స్ ఉన్నారు. వారానికి ఒకరు చొప్పున ఎలిమినేట్ అయి బయటకు వచ్చేస్తున్నారు. మొదటి వారంలో శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అవగా.. రెండో వారంలో మర్యాద మనీష్.. ఆ తర్వాత ప్రియ బయటకు వచ్చారు. ఇక ఇటీవల నాలుగో వారంలో హరిత హరీష్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఏదో వారానికి వచ్చేసరికి ఇంట్లో కేవలం 11 మాత్రమే మిగిలారు. అయితే సండే ఎపిసోడ్ సరదాలతో సందడిగా సాగడంతో పాటు కొందరిని నాగ్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఇక సోమవారం ఎపిసోడ్‌లో నామినేషన్స్ జరగాల్సి ఉండగా.. అందరూ బయటకు వచ్చి నిలబడగా.. నామినేషన్స్‌లో ఉన్నవారిపేర్లు చదివి అందరినీ షాక్‌కు గురి చేశారు. ఈవారం రామ్ రాథోడ్ కెప్టెన్ కావడంతో సేఫ్ అయ్యాడు. నామినేషన్స్‌లో భరణి, సుమన్ శెట్టి(Suman Shetty), షైనీ ఫ్లోరా, ఇమాన్యుయేల్( Emmanuel), సంజన, దమ్ము శ్రీజ, కళ్యాణ్, డిమాన్ పవన్, రీతూ చౌదరి, తనూజ(Tanuja),దివ్య నామినేషన్స్‌లో ఉన్నారు. ఆ తర్వాత బిగ్‌బాస్ ఇమ్యూనిటీ పొందడానికి ఓ గేమ్ పెడతాడు. ఇందులో డిమాన్ పవన్, భరణి మధ్య పోటీ జరగ్గా.. ఇద్దరు కిందపడతారు. దీంతో బిగ్‌బాస్ ఒకరిని.. గేమ్ నుంచి అవుట్ చేయాలనగా.. ఫ్లోరా డిమాన్ పవన్‌ను తొలగిస్తుంది. అంతటితో ప్రోమో అయిపోతుంది. ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న పది మందిలో ఎవరికి ఇమ్యూనిటీ లభిస్తుందనే ఆసక్తిగా మారింది.






