- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Big Boss-9: బిగ్‌బాస్‌లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి బయటకు వచ్చేసిన టాప్ కంటెస్టెంట్?
బిగ్‌బాస్ సీజన్-9 (Bigg Boss Season-9)సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది.

దిశ, సినిమా: బిగ్‌బాస్ సీజన్-9 (Bigg Boss Season-9)సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఇప్పటికే ఐదు వారాలు పూర్తి చేసుకోగా.. కంటెస్టెంట్స్ ఆట తీరులో చాలా మార్పులు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఇటీవల వైల్డ్ కార్డ్స్ ఎంట్రీలతో ఆడియన్స్ తలలు పట్టుకున్నారు. ఇందులో కొందరిని నటీనటులను, అలాగే సోషల్ మీడియా ద్వారా కాంట్రవర్సీతో పాపులర్ అయిన వారిని సెలెక్ట్ చేసుకున్నారు. హౌస్‌లోకి మొత్తం 6మందిని పంపారు. ముఖ్యంగా ఓల్డ్ కంటెస్టెంట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ అన్నట్లుగా టాస్కులు జరిగాయి. ఇక ఐదు వారాలకు గానూ శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్, దమ్ము శ్రీజ, ఫ్లోరా షైనీ ఎలిమినేట్ అయ్యారు.
ఒక వారంలో డబుల్ ఎలిమినేషన్ జరగడంతో 6మంది బయటకు వచ్చారు. ఇక ఆరోవారం ఎలిమినేషన్‌కు సమయం దగ్గరపడింది. ఈ సారి నామినేషన్స్‌లో తనూజ, సుమన్ శెట్టి(Suman Shetty), భరణి(Bharani), దివ్య, డిమాన్ పవన్, రాము రాథోడ్ ఉన్నారు. ఇక ఇందులో భరణి ఎలిమినేట్ అయి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. హౌస్‌లోకి వెళ్లినప్పటి నుంచి టాస్కుల్లో గట్టి పోటీనిస్తున్నారు. అలాగే టాప్‌లో కొనసాగుతున్నారు. అందరితో మంచిగా ఉంటూ బాండింగ్స్ పెంచుకుంటూ ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్న టాప్ కంటెస్టెంట్ అయిన భరణి ఇంట్లోంచి బయటకు రావడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






