నీ వెధవ పనులకు బయట ఊస్తారు.. రతికపై నోరు జారిన అమర్ (వీడియో)

by Disha Web Desk 7 |
నీ వెధవ పనులకు బయట ఊస్తారు.. రతికపై నోరు జారిన అమర్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 ఎవరూ ఊహించని విధంగా ఉల్టా పుల్టాగా దూసుకుపోతుంది. గత వారం సందీప్ ఎలిమినేట్ కాగా.. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు (శోభా శెట్టి, రతిక, భోలే షావలి, టేస్టీ తేజా, ప్రిన్స్ యావర్, ప్రియాంక, అర్జున్, అమర్ దీప్‌) మొత్తం ఎనిమిది మంది సభ్యులు నామినేట్ అయ్యారు. ఇక నామినేషన్ ప్రక్రియ ముగియగానే కెప్టెన్సీ టాక్స్ షురూ చేశాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే హౌస్ మేట్స్‌ను (వీర సింహాలు వర్సెస్ గర్జించే పులులు) రెండు టీమ్‌లుగా డివైడ్ చేశాడు.

ఈ రోజు టాస్క్ సంబంధించిన ప్రోమో రాగా.. అమర్ దీప్ మరోసారి బూతుల వర్షం కురిపించాడు. ఆటలో భాగంగా తనకు కేటాయించిన బ్యాగ్‌ను తీసుకోకుండా అపోజిట్ టీం బ్యాగ్స్‌ని కూడా తీసుకుని వాటిని కిందపడేశాడు. అదేంటని అడిగితే ఇది నా స్ట్రాటజీ అంటూ ఎగిరాడు. దీంతో అపోజిట్ టీంలో ఉన్న రతిక ‘ఎందుకు వెదవ పనులు చేస్తావ్’ అని నోరు జారింది. దీనికి అమర్ దీప్ ‘నువ్వు చేసిన పనుల కంటే కాదులే.. అని ఏదో బూతు మాట్లాడి బయట ఊస్తారు’ అంటూ నోరు జారాడు. ఈ క్రమంలోనే రతిక, అమర్ దీప్‌ల మధ్య కొంచెం సేపు మాటల యుద్ధం నడిచింది. అయితే.. ఏ మాటకామాట చెప్పుకోవాలంటే నిన్న, ఈ రోజు అమర్ దీప్ గేమ్ మాత్రం ఇరగదీస్తున్నట్లు తెలుస్తోంది.


Next Story