Bigg Boss Season 15 : ఆమెకు ఎందుకంత ఇంపార్టెన్స్.. వారానికి ఏకంగా రూ.35 లక్షలు..

by  |
Bigg Boss Season 15 : ఆమెకు ఎందుకంత ఇంపార్టెన్స్.. వారానికి ఏకంగా రూ.35 లక్షలు..
X

దిశ, సినిమా : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లో పార్టిసిపేట్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న సీజన్‌ 15లో కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి ఎంటర్ కాబోతున్న భామ.. హిందీ బిగ్ బాస్ చరిత్రలోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకోబోతుందని సమాచారం. సుశాంత్ డెత్ తర్వాత కెరియర్‌ అండ్ పర్సనల్ లైఫ్‌లో పూర్తిగా లాస్ అయిన రియా.. ఇదొక గోల్డెన్ చాన్స్‌లాగా భావిస్తోందని, ఈ గేమ్ షో ద్వారా తన నిజమైన వ్యక్తిత్వం ఏమిటో ప్రూవ్ చేసుకుని, మీడియా తనపై చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

గతంలో సిద్ధార్థ్ శుక్లాపై చాలా అలిగేషన్స్ వచ్చినా.. బిగ్ బాస్‌లో తన రియల్ పర్సనాలిటీని చూసిన ఆడియన్స్ తనను లవ్ చేయడం స్టార్ట్ చేశారు. కాగా రియా విషయంలోనూ ఇదే జరగాలని కోరుకుంటున్న తన ఫ్యాన్స్.. గ్లోబల్ ఆడియన్స్ ముందు షైన్ అయ్యే ఈ చాన్స్‌‌ను హండ్రెడ్ పర్సంట్ వినియోగించుకోవాలని సజెస్ట్ చేస్తున్నారు. అంతేకాదు మీడియా ట్రయల్స్‌తో మూవీ చాన్స్‌లు కోల్పోయి కొత్తగా అవకాశాలు కూడా లేని రియాకు బిగ్ బాస్ ద్వారా వచ్చే అమౌంట్(వారానికి రూ. 35 లక్షలు) చాలా ప్లస్ కానుంది. ఔట్ సైడ్ మ్యాటర్స్‌ను బిగ్ బాస్ ఇంట్లో మాట్లాడకూడదనే రూల్ ఉండటంతో తనకు ఒక ఫిల్టర్ ఎన్విరాన్మెంట్ కూడా లభించనుంది.


Next Story

Most Viewed